ఇండస్ట్రీలో అభిమాన సెలబ్రిటీలకు సంబంధించి ఏ విషయం తెలిసినా ఫ్యాన్స్ లో కలిగే ఆనందం వేరే లెవెల్ లో ఉంటుంది. ఎందుకంటే.. ఫేవరేట్ హీరో హీరోయిన్స్ గురించి తెలుసుకోవడమే ఫ్యాన్స్ కి సరదా. రెగ్యులర్ గా ఎలాగో సినిమాలు చూస్తుంటారు. కానీ.. సినిమాలు చూస్తే.. యాక్టర్స్ నటనలో మార్పులు చూడగలమేమో.. కానీ, కొత్త విషయాలు తెలియవు కదా! అందుకే ఫేవరేట్ స్టార్స్ మాత్రమే కాదు.. ఏ స్టార్ హీరోహీరోయిన్స్ కి సంబంధించి ఎవరికీ తెలియని విషయాలు తెలిస్తే.. ఎంతో సర్ప్రైజింగ్ గా ఉంటుంది. ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ రామ్ చరణ్ కి సంబంధించి ఓ రేర్ వీడియో చూసి సర్ప్రైజ్ కి గురవుతున్నారు.
అవును.. ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా రామ్ చరణ్ ఎంత పేరు సంపాదించుకున్నాడో తెలిసిందే. మొన్నటివరకూ టాలీవుడ్ స్టార్ అయినప్పటికీ, ఆర్ఆర్ఆర్ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఒకప్పుడు తన యాక్టింగ్ స్కిల్స్ పై కామెంట్స్ చేసినవారికి ఆర్ఆర్ఆర్ తో స్ట్రాంగ్ సమాధానం చెప్పాడు. ఆర్ఆర్ఆర్ లో చరణ్ నటన చూశాక.. విమర్శకులే ప్రశంసలు కురిపించారంటే అర్థం చేసుకోవచ్చు. అదీగాక ఇటీవల జరిగిన ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా అవార్డ్స్ లో ‘ట్రూ లెజెండ్’ అనే అవార్డు అందుకొని.. దేశవ్యాప్తంగా ట్రెండ్ అయ్యాడు. ప్రస్తుతం సినిమాలు చేస్తూనే.. త్వరలోనే ఓ తండ్రి కాబోతున్న గుడ్ న్యూస్ చెప్పి సర్ప్రైజ్ చేశాడు.
ఈ క్రమంలో రామ్ చరణ్ కి సంబంధించి కొత్తగా ఓ వీడియో వైరల్ గా మారింది. రామ్ చరణ్ హీరో కాకముందు యాక్టింగ్ స్కూల్ కి వెళ్లాడని విషయం ఎంతమందికి తెలుసు. ఇప్పుడీ వీడియో చూస్తే.. చరణ్ యాక్టింగ్ స్కూల్ లో తన స్కిల్స్ డెవలప్ చేసుకున్న విజువల్స్ చూడవచ్చు. పైగా చరణ్ తో పాటు హీరోయిన్ శ్రియ కూడా ఆ వీడియోలో కనిపించడం విశేషం. మరి చరణ్, శ్రియ ప్రాక్టీస్ చేస్తున్న థీమ్ ఏంటో తెలియదు. కానీ.. వీడియోలో చూస్తుంటే ఇద్దరు అప్పటికి ఇండస్ట్రీలోకి రాలేదని తెలుస్తోంది. మరి ఎంత గొప్ప యాక్టర్ అయినా, ఏ రంగంలోనైనా గొప్ప స్థాయికి వెళ్లాలంటే తాను చేసే వర్క్ లో ప్రాక్టీస్, బెటర్ మెంట్ అనేవి తప్పనిసరి. వీళ్ళు యాక్టర్స్ గా కామెంట్స్ పేస్ చేసినా.. స్టార్స్ గా వెలుగుతున్నారు. సో.. రామ్ చరణ్ యాక్టింగ్ ప్రాక్టీస్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.