మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో సక్సెస్‌ఫుల్ హీరో పంజా వైష్ణవ్ తేజ్. రెండో సినిమానే క్రిష్ జాగర్లలమూడితో ఛాన్స్ కొట్టేశాడు. ఈ నుంచి సిరీస్ ఆఫ్ అప్‌డేట్స్ వస్తూనే ఉన్నాయి. వైష్ణవ్ తేజ్ హీరోగా, రకుల్‌ప్రీత్ సింగ్ కథానాయికగా తెరకెక్కుతున్న చిత్రం ‘కొండపొలం’. నవల ఆధారంగా డైరెక్టర్ ‘క్రిష్’ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇప్పటికే ‘కటారు రవీంద్ర యాదవ్’గా పంజా వైష్ణవ్ తేజ్ ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది చిత్రబృందం. తాజాగా రకుల్ ప్రీత్‌సింగ్‌ను కూడా ప్రేక్షకులకు పరిచయం చేశారు. ‘ఓబులమ్మ’గా రకుల్‌ప్రీత్ సింగ్ ప్రేక్షకులను అలరించనుంది. ‘నీలో నాలో’ అంటూ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో సాగే ఓ చిన్న వీడియోని విడుదల చేశారు. అడవిలో లంగాఓణీలో రకుల్ ప్రీత్‌సింగ్, రెడ్ టీషర్ట్ వేసుకుని వైష్ణవ్ తేజ్ సందడి చేస్తున్నారు.
ఈ సినిమా అక్టోబర్ 8న థియేటర్లలో రిలీజ్ కాబోతోందని చిత్రబృందం ప్రకటించింది. ప్రస్తుతం కొండపొలం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇటీవల పంజా వైష్ణవ్ తేజ్ ఓ చిత్రాన్ని ఖరారు చేశాడు. కేతిక శర్మ కథానాయికగా, గిరీశయ్య దర్శకత్వంలో వైష్ణవ్ నటించనున్నాడు. డైరెక్టర్ క్రిష్ పవన్, నిధి అగర్వాల్ హీరో,హీరోయిన్లుగా ‘హరిహర వీరమల్లు’ సోషియో ఫాంటసీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.