మీరు విన్నది నిజమే. రీసెంట్ గా 'దాస్ కా ధమ్కీ'తో అలరించిన విశ్వక్ సేన్.. ఇప్పుడు మరో సినిమాతో నేరుగా ఓటీటీలోకి రానున్నాడు. ఇందులో ఐదుగురు హీరోయిన్లు ఉండటం విశేషం.
కరోనా టైంలో ఓటీటీలు తప్ప మనకు మరో ఆప్షన్ లేదు. కాబట్టి చిన్నాపెద్దా మూవీస్ ని డైరెక్ట్ గా ఆయా యాప్స్ లో రిలీజ్ చేశారు. ఆ తర్వాత వైరస్ ప్రభావం తగ్గిపోయింది. థియేటర్లు తెరుచుకున్నాయి. దీంతో ఏదో చోటామోటా హీరోలవి, అవి కూడా థియేటర్ సరుకు కాకపోతేనే ఓటీటీల్లో విడుదల చేస్తున్నారు తప్ప థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. ఇలాంటి ఈ టైమ్ లో యంగ్ హీరో విశ్వక్ సేన్ కొత్త సినిమా.. అది కూడా ఐదుగురు హీరోయిన్లతో కలిసి మూవీ ఇప్పుడు సైలెంట్ గా ఓటీటీలో రిలీజ్ కి సిద్ధమైంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఓటీటీ పేరు చెప్పగానే అందరికీ థ్రిల్లర్, హారర్ మూవీస్ గుర్తొస్తాయి. అలా విశ్వక్ సేన్ నటించిన మూవీ ‘బూ’. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్, మేఘా ఆకాశ్, మాంజిమా మోహన్, నివేతా పేతురాజ్, మోనికా తదితరులు హీరోయిన్లుగా చేశారు. అదేంటి ఇంతమంది స్టార్స్ యాక్ట్ చేసిన సినిమా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు ఎందుకా అని మీరు అనుకోవచ్చు కానీ దాని వెనక ఓ రీజన్ ఉంది. 2021లో ‘అక్టోబరు 31st లేడీస్ నైట్’ పేరుతో ఓ మూవీ స్టార్ట్ అయింది. అదే ఈ సినిమా.
హీరోయిన్ అమలాపాల్ మాజీ భర్త, డైరెక్టర్ ఏఎల్ విజయ్ తీసిన సినిమా ‘బూ’. హారర్ కాన్సెప్ట్ తో తీసిన ఈ మూవీ పలు కారణాలతో ల్యాబ్ కే పరిమితమైంది. ఫైనల్లీ ఇప్పుడు జియో సినిమాస్ లో ఫ్రీగా స్ట్రీమింగ్ కానుంది. మే 27 నుంచి తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులోకి రానుందని ట్వీట్ తో క్లారిటీ ఇచ్చారు. ‘మీకు ఎక్కిళ్లు వస్తే మంచినీరు కోసం చూడకండి. ఓసారి చుట్టూ చూడండి. మీ పక్కనే దెయ్యం ఉండే ఛాన్సుంది’ అని క్యాప్షన్ తో ఓ వీడియోని షేర్ చేశారు. చూడాలి మరి ఈ సినిమా సంగతేంటో? మరి ఈ ‘బూ’ మూవీ గురించి మీలో ఎవరికైనా ఇంతకు ముందే తెలుసా? ఒకవేళ తెలిస్తే మాత్రం కింద కామెంట్ చేయండి.
The next time you get a hiccup don’t look for water, look around, it could be a ghost.
Exclusive World Premiere | May 27th @JioCinema#StreamingFree #BooOnJioCinema #JioCinema #BOO@Rakulpreet @VishwakSenActor @Nivetha_tweets @akash_megha@Reba_Monica @mohan_manjima… pic.twitter.com/7bUU8zhrwU
— Jio Studios (@jiostudios) May 23, 2023