పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం వరుసగా సినిమాలతో పాటు జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఏపీ పాలిటిక్స్ లో యాక్టీవ్ గా ఉంటున్నాడు. గతేడాది భీమ్లా నాయక్ తో ఫ్యాన్స్ ని అలరించిన పవన్.. ఈసారి హరిహర వీరమల్లు, వినోదయ సితం రీమేక్, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి సినిమాలను లైనప్ చేశాడు. చేతినిండా సినిమాలు లైనప్ చేసి.. షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. కానీ.. ముందుగా ఏ సినిమా వస్తుంది అనేది చర్చనీయాంశంగా మారింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం వరుసగా సినిమాలతో పాటు జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఏపీ పాలిటిక్స్ లో యాక్టీవ్ గా ఉంటున్నాడు. గతేడాది భీమ్లా నాయక్ తో ఫ్యాన్స్ ని అలరించిన పవన్.. ఈసారి హరిహర వీరమల్లు, వినోదయ సితం రీమేక్, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి సినిమాలను లైనప్ చేశాడు. అయితే.. చేతినిండా సినిమాలు లైనప్ చేసి.. షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. కానీ.. ముందుగా ఏ సినిమా వస్తుంది అనేది చర్చనీయాంశంగా మారింది. అదీగాక ఎప్పుడో రెండేళ్ల క్రితం మొదలుపెట్టిన ‘వీరమల్లు’ సినిమా రిలీజ్ ఇంకెప్పుడు అని ఎంతోకాలంగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం వీరుడి క్యారెక్టర్ లో కనిపించనున్నాడు.
ఈ క్రమంలో మొదటిసారి పవన్ కళ్యాణ్ ని వీరుడిగా పాన్ ఇండియా లెవెల్ లో చూడబోతున్నామని.. పవన్ కూడా పాన్ ఇండియా హీరో కాబోతున్నాడని అంతా అనుకున్నారు. కానీ.. సినిమా మొదలు పెట్టినప్పటి నుండి షూటింగ్స్ కి బ్రేక్ పడటం.. లేదా పవన్ వేరే సినిమాల షూటింగ్స్ తో బిజీ అయిపోవడం జరుగుతుండటంతో వీరమల్లు వాయిదా పడుతూ వస్తోంది. దీంతో ఇప్పుడీ వీరమల్లు సినిమా విషయంలో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారని తెలుస్తోంది. 2020 సెప్టెంబర్ లో ఈ సినిమాని మొదలు పెట్టారు. ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. కానీ.. దీనికంటే వెనుక ప్రారంభించిన భీమ్లా నాయక్.. రిలీజ్ కూడా అయిపోయింది. అది రిలీజ్ అయి కూడా ఏడాది పూర్తయింది.
భీమ్లా నాయక్ తో మొదటిసారి బ్రేక్ పడగా.. వీరమల్లుకు వినోదయ సితం రూపంలో రెండో బ్రేక్ పడింది. రీసెంట్ గా వినోదయ సితం రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది. దీంతో వీరమల్లు షూటింగ్ మరింత ఆలస్యం కానుంది. అదీగాక.. పవన్ పాలిటిక్స్ లో కూడా యాక్టీవ్ గా ఉంటారు. కాబట్టి.. వీరమల్లు ఇప్పట్లో రావడం కష్టమేనని అంటున్నాయి సినీ వర్గాలు. ఆ విధంగా షూటింగ్ బ్రేక్స్.. వాయిదాల వలన ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వీరమల్లు సినిమా మధ్యలో బలైపోతోందని ఫ్యాన్స్ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సో.. ఇకనైనా పవన్.. అలాగే మేకర్స్ వీరమల్లుని వీలైనంత త్వరగా తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే బాగుంటుందని కోరుతున్నారు. మరి ఈ విషయంపై వీరమల్లు మేకర్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి!