టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మద్య కాలంలో వరుస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ తీవ్ర అనారోగ్యంతో సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో కన్నుమూశారు.
తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ సీనీ నటులు, దర్శక, నిర్మాతలు, ఇతర రంగాలకు చెందిన వారు వరుసగా కన్నుమూస్తున్నారు. దీంతో అటు వారి కుటుంబ సభ్యులు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోతున్నారు. టాలీవుడ్ తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాష్టర్ ఆదివారం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. వివరాల్లోకి వెళితే.
ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విషాదాలు అభిమానులను కలవరపెడుతున్నాయి. గత నెల ప్రముఖ నటుడు శరత్ బాబు కన్నుమూశారు. నిన్న ఆదివారం ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ గాంధీ హిస్పిటల్ చివరి శ్వాస విడిచారు. ఎన్నో హిట్ చిత్రాలకు ఆయన కొరియోగ్రాఫర్ గా పనిచేశారు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ యూట్యూబ్ ఛానల్స్ లో ఇంటర్వ్యూలో ఇస్తూ సొంతంగా తనే ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాడు. రాకేష్ మాస్టర్ 1968 తిరుపతిలో జన్మించారు. ఆయన అసలు పేరు ఎస్. రామారావు. ఆయనకు నలుగురు అక్కలు, అన్న, తమ్ముడు ఉన్నారు. చిన్నప్పటి నుంచి డ్యాన్స్ పై ఎక్కువ మక్కువ చూపించేవారు రాకేష్ మాస్టర్. ప్రముఖ కొరియోగ్రాఫర్ ముక్క రాజు దగ్గర కొంతకాలం అసిస్టెంట్ గా పనిచేశారు. ఆ తర్వాత తనే కొరియోగ్రాఫర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు.
ఇండస్ట్రీలోకి కొరియోగ్రాఫర్ గా ఎంట్రీ ఇచ్చిన రాకేష్ మాస్టర్ బుల్లితెరపై కూడా తన సత్తా చాటారు. పలు డ్యాన్స్ రియాల్టీ షోల్లో జడ్జీగా కూడా వ్యవహరించారు. రాకేష్ మాస్టర్ ఎన్నో విజయవంతమైన పాటలకు కొరియోగ్రఫీ చేశారు. ఆయన కెరీర్ లో దాదాపు 1500 సినిమాలకు పనిచేశారు. టాలీవుడ్ లో ఆయన కొరియోగ్రాఫి చేసిన పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి. మనసిచ్చాను, బడ్జెట్ పద్మనాభం, యువరాజు, సీతారామరాజు, సీతయ్య, గర్ట్ ఫ్రెండ్, లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు, చిరునవ్వుతో, అమ్మో పోలీసోళ్ళు లాంటి చిత్రాల్లో సూపర్ హిట్ సాంగ్స్ కి కొరియోగ్రఫీ అందించారు.
దేవదాసు మూవీలో నువ్వంటేనే ఇష్టం, బంగారం.. బంగారం, నిజంగా చెప్పాలంటే క్షమించు, ఏయ్ బాబూ ఏంటి సంగతి నాలుగు పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి. ప్రభాస్, వేణు, మణిచందన, ప్రత్యూష లాంటి వారికి శిక్షణ కూడా ఇచ్చారు. తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం టాప్ కొరియోగ్రాఫర్స్‌గా కొనసాగుతున్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ సహా మరికొందరు ఒకప్పుడు ఆయన వద్ద శిష్యులుగా ఉన్నారు. రాకేష్ మాస్టర్ మృతిపై పలువురు సెలబ్రెటీలు సంతాపాన్ని వ్యక్తం చేశారు.