టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మద్య కాలంలో వరుస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ తీవ్ర అనారోగ్యంతో సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో కన్నుమూశారు.
ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు జి.ఆనంద్ కరోనాతో కన్నుమూశారు. కొంతకాలంగా కరోనాతో బాధపడుతున్న ఆయనకు సకాలంలో వెంటిలేటర్ లభించలేదని తెలిసింది. శ్రీకాకుళం జిల్లా తులగం గ్రామంలో జన్మించిన ఆనంద్ పూర్తి పేరు గేదల ఆనందరావు. తల్లి అమ్మన్నమ్మ, తండ్రి చంద్రశేఖరం నాయుడు. ఆనంద్ తండ్రి రంగస్థల నటుడు. ఆయన రాముడి పాత్ర పోషిస్తే, ఆనంద్, అతని సోదరుడు లవకుశులుగా నటించేవారు. బాల్యం నుంచే పాటలు పాడటం అలవాటైన ఆనంద్, అనేక పోటీల్లో బహుమతులు సంపాదించుకున్నారు. యుక్త వయసులో […]