సినీ రంగాన్ని ముఖ్యంగా డ్యాన్స్ మాస్టర్లను, అభిమానులను శోక సంద్రంలో ముంచేసి ఈ లోకాన్ని విడిచి పెట్టి వెళ్లిపోయారు ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్. విజయనగరం, విశాఖలో షూటింగ్ ముగించుకుని తిరిగి వచ్చిన ఆయన.. వడదెబ్బ బారిన పడి..
సినీ రంగాన్ని ముఖ్యంగా డ్యాన్స్ మాస్టర్లను, అభిమానులను శోక సంద్రంలో ముంచేసి ఈ లోకాన్ని విడిచి పెట్టి వెళ్లిపోయారు ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్. విజయనగరం, విశాఖలో షూటింగ్ ముగించుకుని తిరిగి వచ్చిన ఆయన.. వడదెబ్బ బారిన పడి.. జూన్ 18న గాంధీ ఆసుపత్రిలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. మద్యం సేవించడమే కాకుండా.. ఆరోగ్యంపై అశ్రద్ధ చూపడంతో రక్తపు విరోచనాలు అయ్యి తుది శ్వాస విడిచారు. ఢీ, ఆట వంటి డ్యాన్స్ రియాల్టీషోల ద్వారా కెరీర్‌ను ప్రారంభించిన రాకేష్ మాస్టర్.. ఎన్నో సినిమాలకు కొరియోగ్రాఫర్ అందించారు. సుమారు 1500 చిత్రాలకు ఆయన కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించారని సమాచారం. ప్రస్తుతం ఆయన శిష్యులైన శేఖర్ మాస్టర్, గణేష్, సత్య మాస్టర్స్. ప్రభాస్ వంటి గ్లోబల్ స్టార్ కూడా ఆయనే డ్యాన్స్ నేర్పారు.
రాకేశ్ మాస్టర్ చనిపోయిన తర్వాత గురు భక్తిని చాటుకున్నారు శేఖర్ మాస్టర్. ఆయన మృతదేహాన్ని భుజాలపై మోయడమే కాకుండా.. దశదిన కర్మ సొంత ఖర్చులతో నిర్వహించారు శేఖర్, సత్యమాస్టర్లు. కాగా, ఇప్పుడు ఆయన విగ్రహానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాకేశ్ మాస్టర్ చనిపోయే ముందు ఆయన బాధ్యతలను తీసుకున్న ఆలేటీ ఈ విగ్రహాన్ని తయారు చేయిస్తున్నారు. హైదరాబాద్‌లో ఈ విగ్రహం తుది మెరుగులు దిద్దుకుంటుంది. ఈ విగ్రహం ఎత్తు 11 అడుగులు. ఈ విషయాన్ని ఆయన శిష్యుడు.. కొరియోగ్రాఫర్ బషీర్ తన యూట్యూబ్ చానల్ ద్వారా వెల్లడించారు. మొత్తం ఖర్చును ఆలేటీ భరిస్తున్నాడని చెప్పారు. త్వరలో ఈ విగ్రహం ఓపెనింగ్ జరగనుందని చెప్పారు. ఆయన ఎక్కడ ఉన్నా.. మా మనస్సుల్లోనే ఉంటాడని తెలిపారు. అయితే ఎక్కడ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారో తెలియాల్సి ఉంది. ఈ విగ్రహంపై కొంత మంది నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.