Rajkummar Rao: సినీ ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదగడం అనేది మామూలు విషయం కాదు. కానీ.. ఈ మధ్యకాలంలో అలా ఎదుగుతున్న హీరోలు ఎంతోమంది ఉన్నారు. దక్షిణాది ఇండస్ట్రీల సంగతి పక్కన పెడితే.. బాలీవుడ్ లో విలక్షణ నటుడిగా గుర్తింపు పొందడం అనేది సవాల్ తో కూడుకున్న విషయం. అయినాసరే ఓ యంగ్ హీరో విలక్షణ నటుడిగా తనకంటూ ప్రత్యేక పేరు సంపాదించుకున్నాడు రాజ్ కుమార్ రావు.
సాధారణ మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చిన రాజ్ కుమార్.. కెరీర్ లో ఎన్నో ఆటుపోట్లు భరించి ఒక్కో మెట్టు ఎదుగుతూ తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. అప్పటినుండి వరుస హిట్స్ తో చేతినిండా సినిమాలతో బిజీ అయిపోయాడు. తాజాగా రాజ్ కుమార్ నటించిన థ్రిల్లర్ మూవీ ‘హిట్: ది ఫస్ట్ కేస్’. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయంతో దూసుకుపోతోందని సమాచారం.
ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజ్ కుమార్.. తన ఆర్థిక విషయాలకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను తెలిపాడు. ‘పదో తరగతి పూర్తయ్యాక ఫేర్ వెల్ పార్టీ ఏర్పాటు చేశారు. ఆ టైంలో మా ఫ్యామిలీ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది. నాకేమో మంచి డ్రెస్ తో పార్టీకి వెళ్లాలని ఉండేది. అదీగాక ఆ పార్టీలో నేను డ్యాన్స్ చేయాల్సి ఉంది. అందుకే నేను దిల్లీలోని చోర్ బజార్ లో రూ.100 పెట్టి జాకెట్ కొన్నా. అలాగే రూ.15తో చైన్ కొని పార్టీకి వెళ్లా’ అని నాటి రోజులను గుర్తు చేసుకున్నాడు. మరి రాజ్ కుమార్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
#rajkumarrao #SanyaMalhotra during movie promotions in Delhi 🕺💃 @viralbhayani77 pic.twitter.com/u69vcBRB6T
— Viral Bhayani (@viralbhayani77) July 12, 2022