జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా.. మనం నడిచి వచ్చన మూలాలను.. ఆ ప్రయాణంలో మనకు సాయం చేసిన వారిని ఎప్పటికి మర్చిపోకూడదు. ఈ మాటలను విశ్వసించడమే కాక.. ఆచరించి చూపుతారు రజనీకాంత్. జీవితంలోని ప్రతి దశలో తనను ఆదుకున్న వారి పట్ల ఎంతో కృతజ్ఞతగా ఉంటారు. తాజాగా ఇందుకు నిదర్శనంగా నిలిచే సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఆ వివరాలు..
రజనీకాంత్.. భారతీయ సినీ చరిత్రలో ఆ పేరుకు ఓ చరిత్ర ఉంది.. ఆ పేరు మీద ఎన్ని రికార్డులున్నాయో లెక్కేలేదు. బస్ కండెక్టర్‌గా జీవితం మొదలు పెట్టి.. సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చి.. అంచెలంచెలుగా ఎదుగుతూ.. తనకంటూ ప్రత్యేక మ్యానరిజం, స్టైలతో.. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సంపాదించుకుని.. సూపర్ స్టార్‌గా ఎదిగారు రజనీకాంత్. ఆయన జీవితం ఎందరికో ఆదర్శం. సినిమాల్లోకి వచ్చాక ఎంతటి స్టార్‌డం వచ్చినా సరే.. సింప్లిసిటీకి నిలువెత్తు నిదర్శనంలా ఉంటారు రజనీకాంత్. ఇక సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికి.. వ్యక్తిగత జీవితానికి కూడా తగిన ప్రాధాన్యత ఇస్తూనే ఉంటారు. ఏడాదిలో కొన్ని రోజుల పాటు.. అందరికి దూరంగా హిమాలయ యాత్ర చేపడతారు. ఇక తన బంధువులు, స్నేహితులను ప్రత్యేకంగా కలిసి.. వారితో సరదాగా గడుపుతారు. ఇక కుటుంబానికి కూడా చాలా ప్రాముఖ్యత ఇస్తారు. బంధాలకు తాను ఎంత ప్రాముఖ్యత ఇస్తారో మరోసారి నిరూపించారు రజనీకాంత్. ఆ వివరాలు..
రజినీకాంత్ పెద్దన్నయ్య సత్యనారాయణ రావ్ గైక్వాడ్ 80వ పుట్టినరోజు వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రజనీకాంత్, ఆయన భార్య లత కూడా పాల్గొన్నారు. పుట్టిన రోజు సందర్భంగా.. అన్నయ్యపై తన ప్రేమను చాటుకున్నారు రజనీకాంత్. బర్త్‌డే రోజున.. అన్నయ్యకు బంగారు నాణేలతో అభిషేకం చేశారు రజనీ. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక అన్న బర్త్‌డే సందర్భంగా రజనీకాంత్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం అది వైరలవుతోంది.
‘‘మా అన్నయ్య సత్యనారాయణరావు గారి 80వ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనటం ఎంతో ఆనందాన్నిచ్చింది. అదే రోజున మా అన్నయ్య కుమారుడు రామకృష్ణ 60వ పుట్టినరోజు కూడా. బంగారం లాంటి హృదయమున్న మా అనయ్యపై బంగారాన్ని కురిపించటాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు నేను ఇలా ఉండటానికి కారణం ఆయనే. అందుకు కారణమైన ఆ దేవుడికి కృతజ్ఞతలు’’ అంటూ అన్నయ్యపై తన అభిమానాన్ని చాటుకున్నారు రజనీకాంత్.
Had the happiness of celebrating the 80th birthday of my brother Sathyanarayana Rao Gaikwad and the 60th birthday of his son Ramakrishna on the same day with my family … felt blessed to shower gold on this golden heart which made me who I am today 🙏🏻 thankful to god. pic.twitter.com/s8npLIzjHG
— Rajinikanth (@rajinikanth) February 19, 2023
అయితే ఈ బర్త్‌డే వేడుకల్లో రజనీకాంత్ కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్యలు పాల్గొనలేదు. అందుకు కారణం వారు పండిట్ రవి శంకర్ నిర్వహిస్తున్న మహా శివరాత్రి వేడుకల్లో పాల్గొనటానికి ఈశా ఆశ్రమానికి వెళ్లారు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం రజినీకాంత్ జైలర్ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఈ సినిమాను నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. అలాగే ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో రూపొందుతోన్న లాల్ సలామ్ చిత్రంలో రజినీకాంత్ గెస్ట్ రోల్ చేయనున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత రజనీకాంత్ జై భీమ్ దర్శకుడు టి.జి.తంగవేల్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించబోతున్నారు. మరి రజనీకాంత్ చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#Superstar @rajinikanth celebrated the 80th birthday of his brother Sathyanarayana Rao Gaikwad! #Thalaivar says : “ I showered gold on this golden heart which made me who I am today 🙏🏻 thankful to god”. pic.twitter.com/C01SppZYdM
— Sreedhar Pillai (@sri50) February 19, 2023