సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్ ఫాలోయింగ్ దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గొప్పగా ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. రజినీకాంత్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో ఒకటి ‘శివాజీ’. ప్రముఖ దర్శకులు శంకర్ దర్శకత్వంలో 2007 వ సంవత్సరం లో రూ. 60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన శివాజీ చిత్రం బాక్సాఫీస్ షేక్ చేస్తూ భారీ వసూళ్లు చేసింది. బ్లాక్ మనీ కథాంశంగా తెరకెక్కిన ఈ చిత్రంలో రజినీకాంత్ డైలాగ్స్, ఎమోషన్, మాస్ ఎలిమెంట్స్ అన్ని అద్భుతంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో రజినీకాంత్ కి జోడీగా అందాల భామ శ్రియ నటించారు.
శివాజీ మూవీలో హీరో రజినీకాంత్ హీరోయిన్ శ్రియ ను మెప్పించడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ఆ సన్నివేశాలలోని భాగంగానే దీపావళి పండుగ సందర్భంగా రజినీకాంత్ టపాసులను కాల్చడానికి ఆమె ఇంటికి వెళ్తారు కానీ శ్రియ తండ్రి రజినీకాంత్ ని తన ఇంట్లో నుంచి గెంటి వేస్తారు. అదే సమయంలో శ్రియ ఇంటి పక్కన ఉండే పాపయ్య అనే వ్యక్తి రజినీకాంత్ ని తన ఇంటికి ఆహ్వానిస్తారు. ఆ అమ్మాయి పెళ్లి చేసుకోకపోతే ఏంటి? నాకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు అని.. వారిలో ఎవరైనా చేసుకోవచ్చు అని రజినీకాంత్ కి చెబుతూ నల్లగా డీ గ్లామర్ గా ఉన్న అక్కమ్మ, జక్కమ్మ లను చూపిస్తాడు. మాతో పరిచయం పెంచుకోండి అంటూ అంటాడు. ఇద్దరు అమ్మాయిలు రజినీకాంత్ వెంట పడతారు. కానీ నాకొద్దు బాబోయ్ అంటూ రజినీ వెళ్ళిపోతారు.
ఇది చదవండి: లేచిపోవడానికి రెడీ అంటున్న అషూ రెడ్డి!
ఈ సన్నివేశం చాలామంది ప్రేక్షకులను బాగా నవ్వించింది. ఫస్టాఫ్ లో ఈ అమ్మాయిలు రెండు మూడు సార్లు కనిపించి బాగా ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత ఏ సినిమాల్లో నటించలేదు. అందరూ ఆ ఇద్దరు అమ్మాయిలు నిజంగా డీ గ్లామర్ గా ఉన్నారని అనుకుంటారు.. కానీ వాస్తవానికి ఆ ఇద్దరు చాలా అందంగా ఉంటారు.. సినిమా హీరోయిన్ల మాదిరి.. వారి అసలు పేర్లు అంగవై, సంగవై. కేవలం రజినీకాంత్ అంటే ఇష్టం.. అందుకే సినిమాల్లో అలా డీ గ్లామర్ గా నటించారు. ఈ ఇద్దరు అమ్మాయిల కు సంబంధించిన రియల్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు వావ్.. అక్కమ్మ, జక్కమ్మ రియల్ గా ఇంత అందంగా ఉన్నారా అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.