తెలుగు చిత్ర పరిశ్రమలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు రోజు రోజుకు మరింత ఆసక్తిగా మారుతున్నాయి. మొదటి నుంచి దూకుడుగా ఉన్న మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ఇప్పటికి కూడా అదే దూకుడుతో వెళ్తున్నారు. ఇక అక్టోబర్ 10 న మా ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్, మంచు విష్ణు తన ప్యానెల్ తో కలిసి ప్రచారంలో భాగంగా సినీయర్ నటులతో కలిసి మా ఎన్నికల కోసం మద్దతును కూడగట్టుకుంటున్నారు.
దీంతో రోజు రోజుకి ప్రకాష్ రాజ్ ప్యానెల్ తో పోలిస్తే మంచు విష్ణు ప్యానెల్ కి మద్దతు మరింత పెరుగుతోంది. ఇక విషయం ఏంటంటే..? ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అంటూ కొందరు ఆయనపై బాహటంగానే విరుచుకుపడుతున్నారు. ఇక ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణలకు కూడా వెనకాడటం లేదంటూ మా ఎన్నికలు ఎంత రసవత్తరంగా సాగబోతున్నాయో అర్థమవుతోంది. కాగా డైరెక్టర్, నటుడు రవిబాబు ప్రకాష్ రాజ్ ను ఉద్దేశించి తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
ఇక తాజాగా రాజీవ్ కనకాల సైతం ప్రకాష్ రాజ్ పై తీవ్రంగా మండిపడ్డారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన నేను మంచు విష్ణు ప్యానెల్ కి సపోర్ట్ చేస్తున్నాను. ఎవ్వరినైన మన తెలుగు వాళ్లు ఆదరించి అన్నం పెడతారు. ఇక అన్నం పెడుతున్నారు కదా అని అదే ఇంట్లో ఇంటూ అంతా నాదే అని పెత్తనం చెలాయిస్తే మేము ఊరకుంటామా అంటూ రాజీవ్ కనకాల ఫైర్ అయ్యారు. ఇక బయటి వ్యక్తులు వచ్చి నీ ఇంటి సంగతి నేను చూస్తారా అంటే మేమేమైన గాజులేసుకుని కూర్చున్నామా? అంటూ ప్రకాష్ రాజ్ ను ఉద్దేశించి మండిపడ్డారు రాజీవ్ కనకాల.