టాలీవుడ్ ప్రముఖ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం పెళ్లి సందD. ఈ సినిమాను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరీ రోనంకి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో రోషన్ సరసన హీరోయిన్గా నటిస్తోంది శ్రీ లీల. ఇక టాలీవుడ్లో 100 పైగా సినిమాలకు దర్శకత్వం వహించాడు రాఘవేంద్రరావు. తన డైరెక్ట్ చేసిన సినిమాల ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు ఎందరో నటులను చిత్ర సీమకు పరిచయం చేశాడు.
ఇక రాఘవేంద్రరావు దర్శకత్వంలో సినిమా వస్తుందంటే ఆ చిత్రాన్ని చూసేందుకు ఎందరో అభిమానులు వెయిట్ చేస్తారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సినిమాల్లో హీరోయిన్లను అందంగా చూపించటంలో ఆయన తర్వాతే ఎవరైన అని చెప్పక తప్పదు. ఇక తాజాగా పెళ్లి సందD సినిమా నుంచి ఓ వీడియోను విడుదల చేశాడు దర్శకధీరుడు రాజమౌళి. ఈ వీడియోలో కళ్లద్దాలు, సూట్ దరించి సరికొత్త స్టైలిష్ లుక్స్‌లో తులుక్కున మెరిశాడు రాఘవేంద్రరావు. దీంతో పాటు బాస్కెట్ బాల్ పట్టుకుని సూపర్బ్‌గా కనిపిస్తున్నాడు.
ఈ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడట మన దర్శకేంద్రుడు. ఎన్నో సినిమాలను తెరకెక్కించిన ఆయన ఎన్నడు కూడా తెరపై కనిపించలేదు. ఇక ఇన్నాళ్లకు ఆయనను మనం తెర మీద చూడబోతున్నామని తెలుస్తోంది. ఇక ఈ సినిమాను మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తుండగా ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. చిత్రీకరణలో ఉన్న ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.