క్రీడా ప్రపంచంలో కొంత మంది క్రీడా కారిణులు తమ ఆటతో అదరగొడతారు. మరి కొంత మంది మాత్రం అటూ ఆటతో ఇటు అందంతో కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొడతారు. అలాంటి వారిలో నేషనల్ క్రష్ స్మృతి మంథాన, సానియా మీర్జా, దీపికా పల్లికల్, పీవీ సింధు లు ముందు వరసలో ఉంటారు. అయితే తాజాగా పీవీ సింధు అలీతో సరదాగా ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ కార్యక్రమంలో సింధు పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. మరిన్ని వివరాల్లోకి వెళితే..
పీవీ సింధు.. బ్యాడ్మింటన్ ప్లేయర్ గా ప్రపంచ వ్యాప్తంగా అందరికి సుపరిచితమే. తన ఆటతో ప్రత్యర్థికి చుక్కలు చూపిస్తుంది. అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకోవడమే కాక తన డ్యాన్స్ తో సైతం అప్పుడప్పుడు అభిమానులను సోషల్ మీడియా ద్వారా పలకరిస్తుంది. తనకు సంబంధించిన వీడియోలను బ్లాగ్ లో షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటుంది. ఈ క్రమంలోనే సింధు అలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గోంది. అలీ అడిగిన పలు విషయాలపై నవ్వుతూ స్పందించింది.
ఈ నేపథ్యంలోనే అలీ సింధును ”నీకు తెలుగు హీరోలలో ఎవరంటే ఇష్టం అని అడగ్గా.. చాలా మంది ఉన్నారు అని సమాధానం చెప్పింది. అలీ అలా కాదు ఒక్కరి పేరు చెప్పు అంటే వెంటనే ప్రభాస్ అంటే ఇష్టం అని సింధూ నవ్వుతూ చెప్పింది. ఇక దీనికి రిప్లై ఇస్తూ.. అలీ ప్రభాస్ దీ నీది సేమ్ హైట్ అనా” అంటూ చమత్కరించాడు. దీంతో సింధు పెదాలపై నవ్వులు పూశాయి. అదీ కాక ప్రభాస్ నేను మంచి స్నేహితులం అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చింది.
ఇక తాజాగా బర్మింగ్ హామ్ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్ 2022లో సింధు బంగారు పతకం సాధించిన విషయం తెలిసిందే. సింధు ఈ షోకి పదహరు అణాల తెలుగు అమ్మాయిగా రడీ అయ్యి వచ్చింది. ప్రతీ మాటకు నవ్వులు పూయిస్తూ ప్రోమో మెుత్తం సింధు నవ్వులతో నిండిపోయింది. మరి సింధు పంచుకున్న విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.