Pushpa: విడుదలై కొన్ని నెలలు గడుస్తున్నా ‘పుష్ప’ సినిమా క్రేజ్ ఏ మాత్రం తగ్గటం లేదు. రోజురోజుకూ పెరుగుతూ పోతోంది. ఈ సినిమా పుట్టిన సౌత్‌లో కంటే నార్త్‌లో ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంది. ఇన్ని రోజులు దేశం ఆ మూలనుంచి ఈ మూల వరకు చిన్నా పెద్ద తేడా లేకుండా పుష్ప డైలాగ్‌ను వాడేశారు. ఇప్పుడు మార్కెట్లోకి కొత్తగా పుష్ప షర్టులు కూడా వచ్చేశాయి. రంగుల రంగుల డిజైన్లతో ఉన్న ఆ షర్టుల మీద పుష్ప స్టార్స్ అల్లు అర్జున్, రష్మిక మందన్నల బొమ్మలు ముద్రించి ఉన్నాయి. కేవలం షర్టులు మాత్రమే కాదు.. పుష్ప లోగోతో పాటు అల్లు అర్జున్ బొమ్మలు ఉన్న టీషర్టులు కూడా మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి. కాగా, అల్లు అర్జున్, రష్మిక మందన్నా హీరో,హీరోయిన్లుగా తెరకెక్కిన పుష్ప సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించారు. ఫాహద్ ఫాజిల్, సునీల్, ధనుంజయ్ నెగిటివ్ రోల్స్‌లో నటించారు. ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
2021 డిసెంబర్లో విడుదలైన ఈ చిత్రం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దాదాపు 200 కోట్ల రూపాయలతో తెరకెక్కి.. 365 కోట్ల రూపాయల మేర వసూళ్లను కొల్లగొట్టింది. దేవీశ్రీ అందించిన మ్యూజిక్.. పాటలు దేశాన్ని ఓ ఊపు ఊపేశాయి. ప్రస్తుతం పుష్ప 2 కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. పుష్ప 2, 1వ భాగాన్ని మించి ఉండబోతోందట. ఈ సినిమా 2023లో విడుదలయ్యే అవకాశం ఉంది. మరి, మార్కెట్లో హల్ చల్ చేస్తున్న పుష్ప షర్టులపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.ఇవి కూడా చదవండి : Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి అవసరమా? వాడు చాలా మారాలి! ధనరాజ్ షాకింగ్ కామెంట్స్!
Thaggedhe le💥🤙
Craze 🔥🔥#PushpaTheRise #PushpaTheRule @alluarjun pic.twitter.com/KNG7A4e3ZG— Rajeshchinna (@Rajeshchinna007) June 5, 2022