ఈ మద్య కాలంలో పలు చిత్రపరిశ్రమల్లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాము ఎంతగానో అభిమానించే నటీనటులు కన్నుమూసిన వార్త తెలిసిన అభిమానులు దుఖఃసాగరంలో మునిగిపోతున్నారు.
ఇటీవల పలు సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్న విషయం తెలిసిందే. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, పంజాబీ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటీనటులు, దర్శక, నిర్మాతలు, పలు విభాగాలుకు చెందిన టెక్నిషియన్లు, రచయితలు, గాయకులు కన్నుమూయడంతో వారి కుటుంబ సభ్యులే కాదు..అభిమానులు సైతం శోక సంద్రంలో మునిగిపోతున్నారు.
కొంతమంది అనారోగ్యంతో చనిపోతే.. మరికొంతమంది రోడ్డు ప్రమాదాలు.. ఇతర కారణాల వల్ల చనిపోతున్నారు. ఒకదశలో ఇండస్ట్రీకి చెందిన వారు ఏ సమయంలో ఎలాంటి దుర్వార్త వినాల్సి వస్తుందో అని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తాజాగా పంజాబీ ఇండస్ట్రీకి చెందిన నటుడు, గాయకుడు కన్నుమూశారు. వివరాల్లోకి వెళితే..
పంజాబీ సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సింగర్, నటుడు సురీందర్ షిండా(64) బుధవారం ఉదయం లుథియానాలోని డీఎంసీ హాస్పిటల్‌లో తుది శ్వాస విడిచారు. ఇటీవల సురిందర్ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో మోడల్ టౌన్ హాస్పిటల్‌లో చేరాడు. ఆయనను 20 రోజుల పాటు వెంటిలేటర్ పై ఉంచారు. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షిణించి తుదిశ్వాస విడిచారు. సురీందర్ షిండాకు రెండు నెలల క్రితం ఆరిసన్ హాస్పిటల్‌లో చిన్న శస్త్రచికిత్స జరిగింది. శస్త్ర చికిత్స తర్వాత ఆయనకు శ్వాస సంబంధింత వ్యాధి భారిన పడ్డారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి కుదుటపడలేదు.
పంజాబ్‌లోని లూథియానా జిల్లా, చోటి అయాలీ గ్రామంలో సురీందర్ షిండా మే 20,1959న జన్మించారు. చిన్నతనం నుంచే ఆయన సింగర్ గా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. ఇండస్ట్రీలో గాయకుడిగానే కాకుండా నటుడిగా ‘పుట్ జట్టన్ దే’, ‘ఉచా దర్ బాబే నానక్ దా’ వంటి చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ‘జియోనా మోర్’ , ‘బద్లా లే లయీన్ సోహ్నేయా’ పాటలతో బాగా పాపులర్ అయ్యారు. ఆయన మృతిపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ట్విట్వర్ వేధికగా సంతాపం తెలిపారు. ‘ప్రముఖ గాయకుడు, నటుడు సురీందర్ షిండాజీ మరణ వార్త వినగానే చాలా బాదపడ్డాను. పంజాబ్ లో ఓ గొప్ప స్వరం శాశ్వతంగా నిశ్శబ్ధం అయ్యింది.. షిండాజీ భౌతికంగా మన మధ్య లేకున్నా.. ఆయన గానం ఎప్పుడూ ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని.. ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నా’ అంటూ ట్విట్ చేశారు. సురీందర్ షిండా సినీ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు.
ਉੱਘੇ ਗਾਇਕ ਸੁਰਿੰਦਰ ਸ਼ਿੰਦਾ ਜੀ ਦੀ ਮੌਤ ਦੀ ਖ਼ਬਰ ਸੁਣਕੇ ਬਹੁਤ ਦੁੱਖ ਹੋਇਆ…ਪੰਜਾਬ ਦੀ ਬੁਲੰਦ ਆਵਾਜ਼ ਅੱਜ ਸਦਾ ਲਈ ਖ਼ਾਮੋਸ਼ ਹੋ ਗਈ…
ਸ਼ਿੰਦਾ ਜੀ ਭਾਵੇਂ ਸਰੀਰਕ ਤੌਰ ‘ਤੇ ਨਹੀਂ ਰਹੇ ਪਰ ਉਹਨਾਂ ਦੀ ਆਵਾਜ਼ ਸਦਾ ਗੂੰਜਦੀ ਰਹੇਗੀ… ਵਿਛੜੀ ਰੂਹ ਨੂੰ ਵਾਹਿਗੁਰੂ ਆਪਣੇ ਚਰਨਾਂ ‘ਚ ਨਿਵਾਸ ਦੇਣ ਤੇ ਪਰਿਵਾਰ ਨੂੰ ਭਾਣਾ ਮੰਨਣ ਦਾ ਬਲ ਬਖ਼ਸ਼ਣ…… pic.twitter.com/d2va6dbvK3
— Bhagwant Mann (@BhagwantMann) July 26, 2023