భారతదేశ చిత్ర పరిశ్రమలో ఇటీవల కాలంలో నటీ, నటుల మరణాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. అనారోగ్యంతో కొంత మంది నటీ నటులు మరణించగా మరి కొంత మంది వివిధ కారణాలతో మరణించారు. ఇప్పుడు మరో వార్త చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. తాజాగా ఆస్ట్రేలియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ సింగర్ మరణించారు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
సింగర్ నిర్వేయర్.. తన గాత్రంతో సగటు సినీ అభిమానులను మైమరపించాడు. పంజాబీ సింగర్ అయిన నిర్వేయర్ సింగ్ పలు హిందీ పాటలు పాడి మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. గత కొన్నిసంవత్సరాలుగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సింగ్ 9 సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియా వచ్చాడు. ఇక్కడే ఉద్యోగం చేసుకుంటూ తన జీవితాన్ని కొనసాగిస్తున్న క్రమంలో ఈ విధంగా జరగడం చాలా బాధాకరం.
ఇక రోజూ లాగానే నిర్వేయర్ ఆఫీస్ కు బయలు దేరాడు. రహదారి మధ్యలో మూడు వాహనాలు ఢీ కొనడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. మెల్ బోర్న్ లోని నార్తవెస్ట్ ప్రాంతంలో ఆగష్టు 30న ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే నిర్వేయర్ ను హస్పిటల్ కు తరలించగా అప్పటికే అతడు మరణించాడని తెలిపారు. ఇక ఈ ప్రమాదానికి కారణం అయిన 23 ఏళ్ల నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు అక్కడి మీడియా తెలిపింది.
ఈ ప్రమాద విషయం తెలిసిన సింగ్ బెస్ట్ ఫ్రెండ్ తన ఇన్ స్టా బ్లాగ్ లో ఇలా రాసుకొచ్చాడు.” నిర్వేయర్ బ్రో నీ మరణ వార్తతోనే నేను నిద్ర లేచాను. ఇది చాలా బాధాకరం. నీ పాటల్లో మాకు చాలా ఇష్టమైంది ”తేరా బినా” సాంగ్ అంటూ చెప్పుకొచ్చాడు. సింగర్ మృతిపై పలువురు సినీ ప్రముఖులు అతని కుటుంబానికి సంతాపం ప్రకటించారు. అతనితో తమకు ఉన్న సంఘటనలను గుర్తు చేసుకున్నారు. మరి సింగర్ నిర్వేయర్ మృతి పట్ల మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.