రౌడీ రోహిణి.. యూట్యూబ్, జబర్దస్త్ చూసే వాళ్లకు ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డాన్సర్‌గా తానేంటో ప్రూవ్ చేసుకున్న రోహిణి.. ఇప్పుడు లేడీ కమెడియన్‌గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అంతేకాకుండా జబర్దస్త్ లో అడుగుపెట్టిన అతి కొద్దికాలంలోనే టీమ్ లీడర్ అయ్యింది. సోషల్ మీడియాలోనూ తనకు మంచి ఫాలోయింగ్ ఉంది. తన కామెడీ టైమింగ్, పర్ఫార్మెన్స్ తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇప్పుడు రోహిణీ కొత్త అవతారం ఎత్తబోతోంది. కొత్తగా రాబోతున్న డాన్స్ ఇండియా డాన్స్ ప్రోగ్రామ్‌తో హోస్ట్ గా మారినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఆ షో ఫస్ట్ ఎపిసోడ్‌కి మహేశ్‌బాబు- సితార స్పెషల్ గెస్టులుగా వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే వారికి సంబంధించిన ప్రోమోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Rohini (@actressrohini) తాజా ప్రోమోలో రౌడీ రోహిణీ- మహేశ్ బాబుల మధ్య ఫన్నీ కన్వర్జేషన్ జరిగింది. పిలిచినా రానంటావా సాంగ్‌తో, లంగాఓణీలో ఎంట్రీ ఇచ్చిన రోహిణీకి మహేశ్ బాబు సెటైర్లు వేశారు. ఆమె అడిగిన ప్రశ్నలకు కౌంటర్లు ఇవ్వడమే కాకుండా ఆమెను పొగడ్తలతో ముంచేశాడు. హీరోయిన్ కావాలంటే ఏం చేయాలి అని రోహిణీ అడగ్గా.. సినిమాల్లో చేయాలంటూ మహేశ్ టైమింగ్‌లో వేసిన పంచ్ హైలెట్ గా నిలుస్తుంది. View this post on Instagram A post shared by Rohini (@actressrohini) బుగ్గలు ఇలా పెరిగిపోతున్నాయి.. మీకులా అందంగా అవ్వాలంటే ఏం చేయాలి అంటూ రోహిణి అడగ్గా.. మీరు చాలా బాగున్నారు బుగ్గలేసుకుని అంటూ మహేశ్ సమాధానం చెప్పాడు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారింది. ఈ వైరల్ ప్రోమోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.