కన్నడ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. పవర్ స్టార్ గా పేరు పొందిన పునీత్ రాజ్ కుమార్ కన్నుమూశారు. జిమ్ లో వర్కౌట్ చేస్తున్న ఆయన సడెన్ కు హార్ట్ ఎటాక్ కు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఇక వెంటనే స్పందించిన ఆయన కుటుంబ సభ్యులు బెంగుళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించగా మరణించాడని వైద్యులు ధ్రువీకరించారు. దీంతో వెంటనే స్పందించిన కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మే హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని పూనీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులను ఓదార్చారు.
అయితే పునీత్ మరణవార్త విన్న సినిమా పరిశ్రమలోని ప్రముఖులే కాకుండా రాజకీయ, క్రీడా రంగంలోని ప్రముఖులు సైతం స్పందిస్తున్నారు. అయితే ఫ్యాన్స్ సందర్శనార్థం పునీత్ డెడ్ బాడీని కంఠీరవ స్టేడియానికి తీసుకెళ్లనున్నారు. ఈ నేపథ్యంలోనే స్టేడియం వెళ్లాల్సిన రోడ్డును పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇక పునీత్ మరణించటంతో ఆయన సోషల్ మీడియా ఖాతాలను నెటిజన్స్ చెక్ చేస్తున్నారు. పునీత్ చివరి సారిగా చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మరుతోంది. భజిరంగి-2 టీమ్‌కు బెస్ట్ విషెస్ చెబుతూ పునీత్ లాస్ట్ ట్వీట్ చేశారు. ఈ చిత్రంలో పునీత్ సోదరుడు శివరాజ్ కుమార్ హీరోగా నటించారు.
Best wishes for the entire team of #Bhajarangi2. @NimmaShivanna @NimmaAHarsha @JayannaFilms
— Puneeth Rajkumar (@PuneethRajkumar) October 29, 2021
Jai Shivanna😍 age is just a number for him.#Bhajarangi2 Pre release event@TheNameIsYash #KGFChapter2 . pic.twitter.com/x61LsFqfLj
— Adheera🗯️ (@AdheeraSukka) October 26, 2021