బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన తర్వాత ఆమెకంటూ ఓ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పడింది. హౌస్నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆమె క్రేజ్ కొనసాగింది. ప్రస్తుతం ఆమె అమెరికాలో ఉంటున్నారు.
సినిమా తారల కెరీర్ లైఫ్ స్పాన్ నీటి మీద బుడగలాంటిది. ముఖ్యంగా నటీమణల సినిమా కెరీర్ చాలా తక్కువ కాలంలోనే ముగిసిపోతూ ఉంటుంది. గ్లామర్, హిట్లు, అదృష్టం మీదే వారి నటనాజీవితం ఆధారపడి ఉంటుంది. పై ఫొటోలో కనిపించే అమ్మాయి కూడా ఒకానొక సమయంలో పిచ్చపాపులారిటీ తెచ్చుకున్నారు. తెలుగు మీడియాలో తరచుగా ఆమె పేరు వినపడేది. తర్వాతి కాలంలో ఆమె సినిమా ఇండస్ట్రీకి దూరం అయ్యారు. ప్రస్తుతం విదేశంలో జీవితాన్ని గడుపుతున్నారు. మీకు ఇప్పటికే అర్థం అయిపోయి ఉంటుంది. ఆ ఫొటోలో ఉన్నది ఎవరో అని. అవును.. మీరనుకుంటున్నది నిజమే ఆమె ప్రముఖ నటి పునర్నవి భూపాలం.
ఆమె 2013లో వచ్చిన ఉయ్యాల జంపాల సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. మొదటి సినిమాతోటే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరించారు. ఈ నేపథ్యంలోనే బిగ్‌బాస్ 3లోకి అడుగుపెట్టారు. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. బిగ్‌బాస్ హౌస్‌లో ఆమె ప్రవర్తన, చేసిన కామెంట్లు ఆమెకు ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్‌ను తెచ్చిపెట్టాయి. సింగర్ రాహుల్ సింప్లిగంజ్-పునర్నవిల మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందంటూ అప్పట్లో పుకార్లు షికార్లు చేశాయి.
అయితే, అవి ఒట్టి పుకార్లేనని తేలింది. పునర్నవి బిగ్‌బాస్ హౌస్‌లోంచి బయటకు వచ్చిన తర్వాత చాలా కాంట్రవర్సీలో చిక్కుకున్నారు. ఆమె ఓ గే కారణంగా గర్భం దాల్చిందంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై ఆమె చాలా సీరియస్ అయ్యారు. అతను తన బెస్ట్ ఫ్రెండ్ మాత్రమేనని.. అలాంటి వాడితో రిలేషన్ అంటగట్టడం చాలా దుర్మార్గం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆమె అమెరికాలోనే ఉంటున్నారు. సోషల్ మీడియా ద్వారా తన అభిమానులను అప్పుడప్పుడు పలకరిస్తూ ఉన్నారు.