డార్లింగ్ ప్రభాస్ వరుసగా బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ లైనప్ చేసి ఫ్యాన్స్ ని గ్యాప్ లేకుండా ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ ఏడాది రాధేశ్యామ్ మూవీతో ప్రేక్షకులను పలకరించిన ప్రభాస్.. తదుపరి లైనప్ మాత్రం చాలా సాలిడ్ గా ప్లాన్ చేసుకున్నాడు. ఇప్పటికే డైరెక్టర్ ఓం రౌత్ తో ఆదిపురుష్ పూర్తి చేసి.. ప్రశాంత్ నీల్ తో సలార్, నాగ్ అశ్విన్ తో ప్రాజెక్ట్ K, మారుతీతో రాజా డీలక్స్ షూటింగ్స్ ని శరవేగంగా కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఆ తర్వాత అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డితో స్పిరిట్ అనే మూవీ చేయనున్నాడు డార్లింగ్. ఈ క్రమంలో 2023లో సమ్మర్ లో ఆదిపురుష్ రిలీజ్ కాబోతుండగా.. సలార్ మూవీ సెప్టెంబర్ లో రిలీజ్ డేట్ ఖరారు చేసుకుంది.
ఆదిపురుష్ మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో రానుండగా.. సలార్ పక్కా మాస్ యాక్షన్ థ్రిల్లర్ గా రెడీ అవుతోంది. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ ఇదివరకు చూడని వయిలెన్స్ తో ఆకట్టుకోనున్నాడు. ఈ సినిమాని హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్ కాగా.. మలయాళం స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నాడు. అయితే.. ప్రస్తుతం షూటింగ్ చివరిదశకు చేరుకోవడంతో సినిమా గురించి, సినిమా రిలీజ్ డేట్ గురించి కొన్ని రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ఆదిపురుష్ సినిమా లేట్ అవుతుండటంతో సలార్ రిలీజ్ వాయిదా పడుతుందేమోనని కంగారు పడుతున్నారు ఫ్యాన్స్.
ఇదిలా ఉండగా.. తాజాగా సలార్ రిలీజ్ గురించి ఎలాంటి టెన్షన్ వద్దని చెబుతూ డార్లింగ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు ప్రొడ్యూసర్ విజయ్ కిరగందుర్. ఆయన మాట్లాడుతూ.. “ప్రెజెంట్ సలార్ మూవీ షూటింగ్ 85% కంప్లీట్ అయ్యింది. జనవరి చివరిలోపు షూటింగ్ పూర్తిచేస్తాం. ఆ తర్వాత విఎఫ్ఎక్స్ కి ఎక్కువ టైమ్ పడుతుంది. అలాగని సినిమా రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు ఉండదు. ఖచ్చితంగా చెప్పిన టైమ్ కే సలార్ రిలీజ్ చేస్తాం. ఆ తర్వాతే సలార్ 2 గురించి అప్ డేట్ ఇస్తాం” అన్నారు విజయ్. దీంతో సలార్ చెప్పిన టైంకే రాబోతుందని తెలిసి ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2023లో సెప్టెంబర్ 23న సలార్ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకి కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నాడు. మరి ప్రభాస్ లైనప్ గురించి, సలార్ మూవీ గురించి మీ అంచనాలు, అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.
‘𝐑𝐄𝐁𝐄𝐋’𝐋𝐈𝐍𝐆 𝐖𝐎𝐑𝐋𝐃𝐖𝐈𝐃𝐄 𝐎𝐍 𝐒𝐄𝐏 𝟐𝟖, 𝟐𝟎𝟐𝟑.#Salaar #TheEraOfSalaarBegins#Prabhas @prashanth_neel @VKiragandur @hombalefilms @shrutihaasan @PrithviOfficial @IamJagguBhai @sriyareddy @bhuvangowda84 @RaviBasrur @shivakumarart @anbariv @SalaarTheSaga pic.twitter.com/8vriMflG84
— Salaar (@SalaarTheSaga) August 15, 2022