ఇండస్ట్రీలో కొన్నిసార్లు నిర్మాతలు బ్లాక్ బస్టర్ సినిమాలను మిస్ చేసుకునే సందర్భాలు చూస్తుంటాం. తాము ముందే స్టోరీ విని, నిర్మించేందుకు రెడీగా ఉన్నప్పటికీ.. తీరా ప్రాజెక్ట్ పట్టాలెక్కే సమయానికి ఏదొక కారణం చేత మిస్ చేసుకున్న సందర్భాలు ఎదురవుతుంటాయి. రీసెంట్ గా తన కెరీర్ లో కూడా కథ నచ్చి.. సినిమా నిర్మించలేకపోయానని ఫీల్ అవుతున్న సినిమా ఒకటుందని సర్ప్రైజ్ చేసింది నిర్మాత స్వప్న దత్.
ఇండస్ట్రీలో కొన్నిసార్లు నిర్మాతలు బ్లాక్ బస్టర్ సినిమాలను మిస్ చేసుకునే సందర్భాలు చూస్తుంటాం. తాము ముందే స్టోరీ విని, నిర్మించేందుకు రెడీగా ఉన్నప్పటికీ.. తీరా ప్రాజెక్ట్ పట్టాలెక్కే సమయానికి ఏదొక కారణం చేత మిస్ చేసుకున్న సందర్భాలు ఎదురవుతుంటాయి. రీసెంట్ గా తన కెరీర్ లో కూడా కథ నచ్చి.. సినిమా నిర్మించలేకపోయానని ఫీల్ అవుతున్న సినిమా ఒకటుందని సర్ప్రైజ్ చేసింది నిర్మాత స్వప్న దత్. ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుస హిట్స్ తో దూసుకుపోతున్న సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్స్ లో స్వప్న ఒకరు. ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి, మెయిల్, సీతారామం సినిమాలతో సూపర్ ఫామ్ లో ఉంది స్వప్న.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని.. తాను ‘అర్జున్ రెడ్డి’ నిర్మించాలని ఎంతో ఆశపడ్డానని, కానీ, ఒకే ఒక్క కారణం చేత తాను ఆ సినిమాని నిర్మించే ఛాన్స్ వదులుకున్నానని చెప్పింది స్వప్న. విజయ్ దేవరకొండ హీరోగా.. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన అర్జున్ రెడ్డి మూవీ.. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టించిందో చెప్పక్కర్లేదు. 2017లో అర్జున్ రెడ్డి ఒక ట్రెండ్ సెట్టర్. ఆ సినిమాతో అటు హీరోగా విజయ్ కి, ఇటు డైరెక్టర్ సందీప్ కి మాసివ్ ఫేమ్, ఇమేజ్ దక్కాయి. అంతేగాక బాక్సాఫీస్ వద్ద మాసివ్ కలెక్షన్స్ కూడా వసూల్ చేసింది అర్జున్ రెడ్డి. ఆ సినిమాని తాను నిర్మించలేకపోయినందుకు చాలా బాధ పడ్డానని తెలిపింది స్వప్న.
స్వప్న మాట్లాడుతూ.. “అర్జున్ రెడ్డి కథ నాకు చాలా నచ్చింది. దాన్ని నిర్మించాలని కూడా ఎంతో ఆశపడ్డాను. కానీ.. ఆ సమయంలో ధైర్యం చేయలేకపోయాను. ఒకవేళ ఆ సినిమా ఏమాత్రం తేడా కొట్టినా.. ఆడపిల్ల ఇలాంటి సినిమా చేసిందేంటి? అని అంటారని భయపడ్డాను. అలా ఆ సినిమా విషయంలో బాధ ఉంది. ఇక ‘పెళ్లి చూపులు’ విషయానికి వస్తే.. స్క్రిప్ట్ విన్నాక నేను పెద్దగా ఆసక్తి చూపించలేదు. సినిమా ఫార్మాట్ భిన్నంగా ఉండటంతో నేను అర్థం చేసుకోలేకపోయాను. అలా విజయ్ చేసిన రెండు బ్లాక్ బస్టర్ సినిమాలను మేం మిస్ అయ్యాము” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నిర్మాత స్వప్న దత్ మాటలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. మరి అర్జున్ రెడ్డి, పెళ్లి చూపులు సినిమాలపై, స్వప్న నిర్మించిన మహానటి, సీతారామం సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.