ఇండస్ట్రీలో కొన్నిసార్లు నిర్మాతలు బ్లాక్ బస్టర్ సినిమాలను మిస్ చేసుకునే సందర్భాలు చూస్తుంటాం. తాము ముందే స్టోరీ విని, నిర్మించేందుకు రెడీగా ఉన్నప్పటికీ.. తీరా ప్రాజెక్ట్ పట్టాలెక్కే సమయానికి ఏదొక కారణం చేత మిస్ చేసుకున్న సందర్భాలు ఎదురవుతుంటాయి. రీసెంట్ గా తన కెరీర్ లో కూడా కథ నచ్చి.. సినిమా నిర్మించలేకపోయానని ఫీల్ అవుతున్న సినిమా ఒకటుందని సర్ప్రైజ్ చేసింది నిర్మాత స్వప్న దత్.
టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు ఇండియన్ సినిమా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ప్రాజెక్ట్ కె ఒకటి. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్న ఈ మూవీలో.. ఓ పాన్ ఇండియా స్టార్ స్పెషల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
చిత్ర పరిశ్రమలో చాలా నిర్మాణ సంస్థలు ఉన్నాయి. కానీ అందులో చాల వరకు కమర్షియల్ సినిమాల నిర్మాణానికే ఎక్కువ మెుగ్గు చూపుతాయి. ఇలాంటి సమయంలో విలువలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రేక్షకులను కట్టిపడేసే చిత్రాలను నిర్మించడంలో వైజయంతి మూవీస్ సంస్థ ముందు వరసలో ఉంటుంది. తాజాగా ఆ సంస్థ నుంచి విడుదలైన సీతారామం మూవీ భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో అశ్వనీదత్ అలీతో సరదాగా షో లో మాట్లాడుతూ.. పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మరిన్ని […]
వైజయంతి మూవీస్.. తెలుగు సినిమా ప్రేక్షకులకు ఈ బ్యానర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నందమూరి తారక రామారావు చేతుల మీదుగా ప్రారంభం అయిన ఈ సంస్థ టాలీవుడ్‌లో ఎన్నో అద్భుత చిత్రాలను నిర్మించింది, నిర్మిస్తోంది. ఎన్టీఆర్, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, చిరంజీవి, బాలకృష్ణ లాంటి సూపర్ స్టార్లతో ఎన్నో గొప్ప హిట్స్ అందుకుంది. అంతేకాకుండా మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, నారా రోహిత్‌లాంటి వారిని హీరోలుగా […]