చిత్ర పరిశ్రమలో చాలా నిర్మాణ సంస్థలు ఉన్నాయి. కానీ అందులో చాల వరకు కమర్షియల్ సినిమాల నిర్మాణానికే ఎక్కువ మెుగ్గు చూపుతాయి. ఇలాంటి సమయంలో విలువలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రేక్షకులను కట్టిపడేసే చిత్రాలను నిర్మించడంలో వైజయంతి మూవీస్ సంస్థ ముందు వరసలో ఉంటుంది. తాజాగా ఆ సంస్థ నుంచి విడుదలైన సీతారామం మూవీ భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో అశ్వనీదత్ అలీతో సరదాగా షో లో మాట్లాడుతూ.. పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మరిన్ని వివరాల్లోకి వెళితే..
అశ్వనీదత్.. అప్పట్లో భారీ చిత్రాల నిర్మాత అనగానే వినిపించే పేరు. తాజాగా ఆయన నిర్మించిన సీతారామం మంచి విజయాన్ని సాధించింది. ఈ సందర్భంగా ఆయన అలీతో సరదాగా షోలో మాట్లాడుతూ.. నేను ఇప్పటికీ సీనియర్ ఎన్టీఆర్ ని దైవంగానే భావిస్తానని అన్నారు. మరి అన్నగారి పార్టీలో ఎందుకు చేరలేదు అని అలీ అడగ్గా.. నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదని అన్నారు. మెగాస్టార్ నటించిన ‘చూడాలని ఉంది’ మూవీని హిందీలో రీమేక్ చేసి చేతులు కాల్చుకున్నామని, ఆ సినిమాతో నేను అల్లు అరవింద్ చేరో రూ.6 కోట్లు నష్టపోయామని వివరించారు.
ఈ నేపథ్యంలో అందరు అనుకుంటున్నట్లు ఓటీటీలు ప్రమాదకరం కాదని వాటి కంటే డేంజర్ యూట్యూబ్ అని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అయితే జగదేక వీరుడు అతిలోక సుందరి-2 తాను నిర్మించే చివరి సినిమా అని పేర్కొన్నారు. ప్రభాస్ హీరోగా తాను నిర్మిస్తున్న ప్రాజెక్ట్ కె మూవీ 55 శాతం షూటింగ్ పూర్తి అయ్యిందని, షెడ్యూల్ ఉంటే షూటింగ్ ల బంద్ ఉన్నాగాని నేను షూటింగ్ జరిపేవాడినని అన్నారు. ఇక తాను జాతిరత్నాలు సినిమా చూసి కడుపుబ్బా నవ్వుకున్నాను అని వివరించారు. చివరగా తాను శక్తి సినిమా విషయంలో చాలా నిరుత్సాహ పడ్డట్లు తెలిపారు. మరి నిర్మాత అశ్వనీదత్ పంచుకున్న విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.