ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా వైరలయిన దంపతులు ఎవరంటే తమిళ నిర్మాత రవీందర్, ఆయన భార్య మహాలక్ష్మి. దాదాపు నెల రోజుల పాటు సోషల్ మీడియాలో వీరి పెళ్లి, దానిపై ట్రోలింగ్.. ఇదే నడిచింది. అందుకు కారణం రవిందర్.. అధిక బరువు. ఇక వీరి పెళ్లి ఫోటోలు చూసిన వారు.. కేవలం డబ్బు కోసమే మహాలక్ష్మి.. రవీందర్‌ని వివాహం చేసుకుందని ట్రోల్ చేశారు. పైగా ఈ దంపతులిద్దరికి ఇది రెండో వివాహమే. మహాలక్ష్మికి కుమారుడు కూడా ఉన్నాడు. అయితే తమ మీద ఎంత ట్రోలింగ్ జరిగినా సరే.. ఈ జంట మాత్రం వాటిని పట్టించుకోకుండా.. నూతన దాంతప్య జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. భార్య మీద తన ప్రేమను ఎప్పటికప్పుడు వెల్లడిస్తున్నాడు రవీందర్. ఈ క్రమంలో తాజాగా భార్య మహాలక్ష్మికి ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చాడు రవీందర్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరలవుతున్నాయి. ఆ వివరాలు..
దీపావళి పండుగను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది ఈ జంట. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అవి తెగ వైరలయ్యాయి. ఈ ఫోటోలు చూసిన వారు.. మిమ్మల్ని విమర్శించే వారు కుళ్లుకునేంత సంతోషంగా మీరు జీవించాలి అని కామెంట్ చేశారు. ఇక వీరిద్దరూ ఒకరిని ఉద్దేశించి ఒకరు చేసిన పోస్ట్‌లు తెగ వైరలయ్యాయి. దీనిలో మహాలక్ష్మి.. రవీందర్‌ని ఉద్దేశించి మై మ్యాన్.. లవ్ యూ అని చేసిన పోస్ట్ అయితే విపరీతంగా వైరలయ్యింది. పండుగ సెలబ్రేషన్స్ మూడ్ నుంచి ఇంకా బటయకు రాకముందే.. భార్యకు మరో సర్ఫ్రైజ్ ఇచ్చాడు రవీందర్. మహాలక్ష్మి కోసం ఖరీదైన లగ్జరీ కారు కొనుగోలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
‘మనం జీవితాంతం ప్రేమించే వ్యక్తిని కనుగొనడం చాలా కష్టం. మనం ప్రేమించే వ్యక్తి.. తిరిగి మనల్ని అంతే గొప్పగా ప్రేమిస్తే అది మరింత విశేషం. కొత్త భార్య, కొత్త జీవితం, కొత్త కారు.. ఈజీ డ్రైవింగ్ అండ్ క్రేజీ సాయంతో స్వచ్ఛమైన స్వర్గం లాంటి కారును మనం పొందగలమని కోరుకుంటున్నాను’’ అంటూ కొత్త కారు ఫోటోలని పోస్ట్ చేశాడు రవీందర్. బ్రిటిష్ ఆటోమొబైల్ కంపెనీ మోరీస్ గ్యారేజీ కారుని కొనుగోలు భార్యకు గిఫ్ట్‌గా ఇచ్చాడు. దీని ధర సుమారు 32 లక్షల రూపాయల వరకు ఉండవచ్చని తెలుస్తోంది.
ఇక మహాలక్ష్మికి రవీందర్ కంటే ముందే అనిల్ నేరేడిమిలితో వివాహం జరిగింది. వీరికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. అయితే 2019లో మళ్లీ విడాకులు తీసుకున్నారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఈ జంట మాత్రం వాటిని పట్టించుకోకుండా కొత్త జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు.