ఇటీవల సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు నటులు, దర్శక, నిర్మాతలు కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటూ తమ మంచితనాన్ని చాటుకుంటున్నారు. ప్రకృతి విపత్తు వచ్చిన సమయంలో భారీ విరాళాలు అందజేస్తున్నారు. ఇటీవల కొంత మంది సినీ రంగానికి చెందిన వారు గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ది చేస్తున్నారు. తమ అభిమానులు కష్టాల్లో ఉంటే వారికి సహాయం చేస్తున్నారు. తాజాగా తమిళ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్. థాను కష్టాల్లో ఉన్న ఓ మహిళలను ఆదుకొని తన మంచి మనసు చాటుకున్నారు.
ఇటీవల ఓ మహిళ ఊపిరి తిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ.. చెన్నయ్ కావేరీ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఆమెకు రెండు ఊపిరితిత్తులు ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాలని లేదంటే ఆమె ప్రాణానికి ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారు. దీంతో ఆమె దాతలు ఎవరైనా ఉంటే తనను ఆదుకోవాలని కోరుతున్నారు. అలాగే ట్రాన్స్ ప్లాంట్ అథారిటీ ఆఫ్ తమిళనాడు లో సైతం తన పేరు నమోదు చేసుకుంది. ఆ మహిళ పడుతున్న కష్టాల గురించి తమిళ నిర్మాత కలైపులి ఎస్. థాను దృష్టికి వచ్చింది.. దాంతో ఆయన చలించిపోయారు.
చెన్నైన్ కావేరీ ఆసుపత్రికి వెళ్లిన ఆయన ఆ మహిళను కలుసుకొని కొద్దిసేపు ఆమెతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అలాగే ఆమె చికిత్స కోసం రూ.5 లక్షల రూపాయలు కావేరీ ఆసుపత్రి వైద్యులకు అందజేశారు. ఆ మహిళ వైద్యానికి అయ్యే మొత్తం ఖర్చులో తాము కొంత రాయితీ కల్పిస్తున్నామని.. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి ఆమెకు సహాయం చేయాల్సిందిగా కోరారు. మహిళ ఆరోగ్యం గురించి తెలిసి వెంటనే వెళ్లి సహాయం అందించిన నిర్మాత కలైపులి ఎస్. థాను పలువరు ప్రశంసిస్తున్నారు.