ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. గత ఏడాది టాలీవుడ్ లో సినీ దిగ్గజాలు వరుసగా కన్నుమూశారు. తమ అభిమాన నటులు, దర్శక, నిర్మాతలు కన్నుమూయడంతో అభిమానులు శోక సంద్రంలో మునిగిపోతున్నారు.
ఇటీవల సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. పలు ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖ నటీనటులు, దర్శక, నిర్మాతలు ఇతర సాంకేతిక వర్గానికి చెందిన వారు వరుసగా కన్నుమూయడంతో వారి కుటుంబ సభ్యులే కాదు.. వారిని ఎంతగానో అభిమానించే అభిమానులు సైతం విషాదంలోమునిగిపోతున్నారు. తాజాగా సినీ ఇండస్ట్రీలో మరో విషాదంచోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత కన్నుమూశారు.
సిని ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత ఎస్ఎస్ చక్రవర్తి శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు.. ఆయన వయసు 53 సంవత్సరాలు. కోలీవుడ్ లో ఎన్నో హిట్ చిత్రాలకు నిర్మాతగా వ్యహరించి మంచి అభిరుచి కలిగిన ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్నారు. గత కొంతకాలంగా చక్రవర్తి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించి చికిత్స అందించారు కుటుంబ సభ్యులు. కానీ ఆయన ఆరోగ్య పరిస్తితి మెరుగుపడలేదు.. దీంతో శనివారం ఉదయం తుది శ్వాస విడిచారు. 1997 లో ‘రాశి’ అనే చిత్రంతో ఆయన నిర్మాతగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.
90వ దశకం నుంచి తమిళ పరిశ్రమలో నిర్మాతగా కొనసాగుతున్నారు చక్రవర్తి. తమిళ స్టార్ హీరో అజిత్ తో ఎన్నో హిట్ చిత్రాలు నిర్మించారు.. వీరి మద్య ఎంతో మంచి సాన్నిహిత్యం ఉండేదని ఇండస్ట్రీలో టాక్. హీరో అజిత్ కుమార్ తో వాలి, రెడ్, సిటిజెన్, మగవారే, ఆంజనేయ అనే చిత్రాలను తెరకెక్కించారు. అజిత్ తర్వాత ఎక్కువ చిత్రాలు శింబుతో తీశారు. వీరిద్దరి కాంబినేషన్ లో కాలై, వాలు లాంటి హిట్ చిత్రాలు వచ్చాయి. నిర్మాత చక్రవర్తి మరణంతో ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది. చక్రవర్తికి ఒక కొడుకు, కుమార్తె ఉన్నారు. ఆయన తనయుడు జానీ రేణిగుంట అనే చిత్రంలో హీరోగా నటించాడు. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు నివాళులర్పిస్తున్నారు.