ఓ సినీ నటి మరణించినట్లు ఓ పోస్టర్ కలకలం రేపింది. దీంతో అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మామూలుగా సినిమా వాళ్ల విషయాల పట్ల సినీ ప్రియులు ఎప్పటికప్పుడు సెర్చ్ చేస్తూ, నటుల పట్ల వారికున్న అభిమానాన్ని వ్యక్త పరుస్తుంటారు.
ఓ సినీ నటి మరణించినట్లు ఓ పోస్టర్ కలకలం రేపింది. దీంతో అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మామూలుగా సినిమా వాళ్ల విషయాల పట్ల సినీ ప్రియులు ఎప్పటికప్పుడు సెర్చ్ చేస్తుంటారు. అలానే నటుల పట్ల వారికున్న అభిమానాన్ని వివిధ రూపాల్లో వ్యక్తపరుస్తుంటారు. మరి వారు అభిమానిస్తున్న తారలకు ఏమైన జరిగిందంటే వారు ఏమాత్రం తట్టుకోలేరు. తాజాగా సినీ నటి అనికా సురేంద్రన్ మరణించినట్లు ఓ పోస్టర్ బయటికి రావడంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
ఆమెకు అసలు ఏమైంది, ఏదైనా జరగకూడని ప్రమాదం జరిగిందా అని షాక్ కు గురవుతున్నారు. ఈమె కోలీవుడ్ స్టార్ అజిత్ నటించిన విశ్వాసం చిత్రంలో ఆయనకు కూతురుగా నటించింది. చైల్డ్ ఆర్టిస్టుగా విశ్వాసం సినిమాతో వెండితెరపై అరంగేట్రం చేసిన ఈ అమ్మడు మొదటి సినిమాతోనే నటనలో మంచి మార్కులు కొట్టేసింది. ఈ సినిమాలో అజిత్ కూతురుగా నటించి మెప్పించడంతో ఆయనకు రీల్ కూతురు ఎవరంటే అనికా అనేంతగా అభిమానుల్లో ముద్ర పడిపోయింది.
ఈ సినిమా విజయవంతమవడంతో తరువాత తమిళం, మళయాలం సినిమాల్లో నటించింది. తాజాగా తెలుగులో బుట్టబొమ్మ సినిమాతో హీరోయిన్ గా మారి పోయింది. ఇప్పుడు ఈమె చనిపోయినట్లు ఓ పోస్టర్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. కానీ ఆ పోస్టర్ ఓ సినిమా కోసం చేసినదని తేలడంతో అభిమానులందరు ఊపిరి పీల్చుకున్నారు. అనికా సురేంద్రన్ నటించే, నటించబోయే సినిమాలు విజయవంతమవ్వాలని, అవకాశాలను అందిపుచ్చుకుని స్టార్ హీరోయిన్ అవ్వాలని ఆకాంక్షిద్దాం. మరి.. ఈ వార్తపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.