ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. దీంతో రోడ్లపై వెళ్తున్న వాహనాలు టైర్లు అకస్మాత్తుగా పగిలిపోవడం.. ఇంజన్ హీట్ ఎక్కడం.. ఇతర ఇబ్బందులు వచ్చి నడిరోడ్డుపై వాహనాలు ఆగిపోయిన సందర్భాలు ఎన్నో ఉంటున్నాయి.
చెన్నైలో రూ.535 కోట్ల నగదుతో వెళ్తున్న ఓ ట్రక్కు నడిరోడ్డుపై ఆగిపోయింది. రిజర్వూబ్యాంక్ నుంచి విపుల్లాపురం తరలిస్తుండగా ఆగిపోయిన ట్రక్. ముంబాయి రిజర్వ్యూ బ్యాంక్ నుంచి రూ.535 కోట్లతో ఓ కంటైనర్ బయలుదేరింది. ఈ భారీ నగదును విపుల్లాపురానికి తరలిస్తుండాగా తాంబరం ప్రాంతంలో మెయిన్ రోడ్డుపై అకస్మాత్తుగా బ్రేక్ డౌన్ కావడంతో ఆగిపోయింది. ఇంత భారీ మొత్తాన్ని తరలిస్తున్న కంటైనర్ నడిరోడ్డుపై ఆగిపోవడంతో వెంటనే డ్రైవర్, సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కంటైనర్ ఆగిపోయిన చోటికి చేరుకొని భారీ బందోబస్తున్న ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే భారీ కోట్ల రూపాయలతో బయలు దేరిన కంటైనర్ రోడ్డుపై ఆగిపోయిందన్న విషయం తెలిసిన కొంతమంది జనాలు గుంపులుగా తరలివచ్చారు. ప్రస్తుతం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.