పెళ్లిబంధంతో ఒక్కటై.. కడదాకా ఒకరికొకరు తోడూ నీడగా ఉంటూ సంతోషంగా ఉండే దంపతులకు ఒక్కోసారి ఆరోగ్య సమస్యలు శాపంగా మాకి.. గంటల వ్యవధిలోనే భార్యాభర్తలు తనువు చాలించిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.
వేద మంత్రాల సాక్షిగా.. మూడు ముళ్లు వేసి, ఏడడుగులు నడిచి జీవితాంతం తోడూ నీడగా ఉంటానని పెద్దల దీవెనలతో పెళ్లి బంధంతో ఒక్కటవుతారు జంట. కానీ ఈ మద్య కాలంలో పెళ్లైన ఏడాదికే భార్యాభర్తల మద్య అభిప్రాయభేదాలు రావడంతో కోర్టుమెట్లు ఎక్కుతున్నారు. అనుమానాలు.. అహంబావం ఇలా ఎన్నో కారణాల వల్ల భార్యాభర్తలు విడిపోతున్నారు. అలాంటిది భర్త చనిపోయిన 24 గంటల్లోన ఆయన మరణం తట్టుకోలేక భార్య కన్నుమూసిన విషాద ఘటన నెల్లూరు జిల్లా జరిగింది. వివరాల్లోకి వెళితే..
జీవితాంతం తోడుగా ఉంటానని బాస చేసిన భర్త అకస్మాత్తుగా కన్నుమూయడంతో భార్య తట్టుకోలేకపోయింది.. నీవు లేని జీవితం నాకెందుకు అంటూ అంత్యక్రియలు జరిగిన 24 గంటల్లోనే కన్నుమూసింది. గంటల వ్యవధిలోనే అనారోగ్యం వల్ల భార్యాభర్తలు ఒకేరోజు కన్నుమూయడంతో నెల్లూరు జిల్లా నరుకూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. నరుకూరు గ్రామానికి చెందిన రమణ(40), సుమలత (36) దంపతులు. కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమంగా మారడంతో వారం రోజుల క్రితం రమణను కుటుంబ సభ్యులు చెన్నైకి తరలించారు.
నిన్న ఉదయం చెన్నై నుంచి నెల్లూరు ప్రభుత్వ ఆసుత్రికి తీసుకొని వచ్చారు కుటుంబ సభ్యులు. భర్త చికిత్స పొందుతున్న సమయంలోనే భార్య సుమలత కూడా తీవ్ర అనారోగ్యానికి గురైంది.. దీంతో ఆమె చెన్నైలో చికిత్స పొందుతుంది. ఈ క్రమంలో రమణ బుధవారం ఉదయం నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. భర్త కన్నుమూసిన విషయం తెలుసుకున్న సుమలత తట్టుకోలేకపోయింది. రమణ అంత్యక్రియలు జరిగిన 24 గంటలలోపే సుమలతో చెన్నై ఆసుపత్రిలో కన్నుమూసింది. ఒకేరోజు లో భార్యాభర్తలు చనిపోవడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.