టాలీవుడ్ లో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రముఖ నిర్మాత, ఫైనాన్షియర్, డిస్టిబ్యూటర్, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఏషియన్ గ్రూప్ నారాయణ్ దాస్ కె.నారంగ్ మృతి చెందారు. గత కొంతకాలంగా నారాయణ్ దాస్ నారంగ్ తీవ్ర అస్వస్థతో బాధపడుతున్నారు. స్టార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. నారయణ్ దాస్ మృతితో టాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
లవ్ స్టోరీ, లక్ష్య వంటి చిత్రాలు నిర్మించడమే కాకుండా.. శివకార్తికేయన్, ధనుష్, నాగార్జున వంటి టాప్ హీరోల సినిమాలకు నిర్మాతగా ఉన్నారు. నాగార్జున ఘోస్ట్ ఇప్పటికే సెట్స్ లో ఉండగా.. ధనుష్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. శివకార్తికేయన్ 20వ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. నారాయణ్ దాస్ నారంగ్ కుటుంబ సభ్యులకు ప్రముఖులు సంతాపం తెలిపారు.
Asian Group Narayandas Narang garu passed away. May his soul rest in peace 🙏 pic.twitter.com/Jhl85fWK9b
— Vamsi Kaka (@vamsikaka) April 19, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.