డబ్బు సంపాదించటం ఓ కళ! అది కళ కాబట్టే… అత్యధిక శాతం మందికి కలగానే మిగిలిపోతుంటుంది! కోట్లాది రూపాయాలు సక్రమంగా సంపాదించటం అందరి వల్లా అవుతుందా చెప్పండి? అస్సలు కాదు! కానీ, ప్రియాంకా చోప్రాకి మాత్రం ఇన్ స్టాంట్ గా కోట్లు వచ్చేస్తున్నాయి!ఇందుకు సోషల్ మీడియా సైట్స్ ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కారణంగా నిలుస్తున్నాయి.
సోషల్ మీడియా..సెలబ్రిటీలకు సరికొత్త మనీ మెషీన్ గా మారుతోంది. మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ కలిగిన సెలబ్రిటీలు.. సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ వేదికగా కొట్లు సంపాదిస్తున్నారు. తమ సోషల్ అక్కౌంట్స్ ద్వారా.. కొన్ని ప్రోడక్ట్స్ కి సంబంధించిన పోస్ట్స్ చేస్తే చాలు.. కోట్లలో ఆర్జించే అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నారు. మాజీ విశ్వసుందరి ప్రియాంక చోప్రా ఈ బిజినెస్‌లో అందరికంటే ముందుంది.
ఇన్ స్టా గ్రామ్‌లో 65 మిలియన్ల ఫాలోవర్స్ కలిగిన ప్రియాంక.. ఒక్కో కమర్షియల్ పోస్టుకి 3 కోట్లు ఛార్జ్ చేస్తుందట. తాజాగా విడుదలైన ఇన్ స్టా గ్రామ్ రిచ్ లిస్టులో ప్రపంచవ్యాప్తంగా ప్రియాంక 27వ స్థానంలో నిలిచింది. ఇక.. ఇండియా నుంచి ఈ లిస్టులో నిలిచిన మరో వ్యక్తి స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ. కోహ్లీ ఒక్కో పోస్ట్ కి 5 కోట్లు తీసుకుంటున్నాడట. ప్రపంచవ్యాప్తంగా ఈ జాబితాలో ఫుట్ బాల్ స్టార్ క్రిస్టియానో రోనాల్డో అగ్రస్థానంలో నిలిచాడు. రోనాల్డో ప్రతీ స్పాన్సర్ పోస్ట్ కి 11.9 కోట్లు ఛార్జ్ చేస్తుండటం విశేషం.