Ramya Raghupathi: ఇటు తెలుగుతో పాటు, అటు కన్నడ ఇండస్ట్రీలోనూ నరేష్, ప్రవిత్రా లోకేష్‌ల రిలేషన్‌పై పెద్ద చర్చ జరుగుతోంది. నరేష్ మూడో భార్య రమ్య ఎంట్రీతో ఆ వివాదం పెద్దదైంది. రమ్య గత రెండు రోజుల నుంచి కన్నడ మీడియా ముందుకు వస్తూ నరేష్, పవిత్రా లోకేష్‌లపై కామెంట్లు చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో రమ్య కామెంట్లు వైరల్‌గా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో నరేష్ మూడో భార్య రమ్య బ్యాక్‌గ్రౌండ్ ఏంటని నెటిజన్లు సెర్చ్ చేయటం మొదలుపెట్టారు. ఇంతకీ ఎవరీ రమ్య.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఎంటి?..
రమ్య స్వస్థలం ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా, మడకశిరలోని నీలకంఠపురం గ్రామం. సీనియర్ కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి, రమ్య తండ్రి వరుసకు అన్నదమ్ములు. ఇక, కేజీఎఫ్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్‌కు రమ్య సోదరి అవుతుంది. ప్రశాంత్ నీల్ తండ్రి, రమ్య తండ్రి అన్నదమ్ములు. వీరి కుటుంబాలు దశాబ్ధాల క్రితమే కర్ణాటకకు వలస వెళ్లాయి. రమ్య తండ్రికి బెంగళూరులో ‘హోటల్ మోతీ మహాల్’ అనే పెద్ద హోటల్ ఉంది.
శుక్రవారం కన్నడ మీడియాతో మాట్లాడుతూ.. కన్నడ మీడియా ముందుకు వచ్చిన రమ్య.. నరేష్, పవిత్రా లోకేష్‌ల పెళ్లిపై సంచల వ్యాఖ్యలు చేశారు. పవిత్రా లోకేష్, నరేష్‌లకు పెళ్లయిందని ఆరోపించారు. తాను నరేష్‌నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని అన్నారు. రమ్య మాట్లాడుతూ.. ‘‘ నిన్న ప్రెస్ మీట్లో పవిత్ర నా భార్య అని నరేష్ అన్నారు. ఇద్దరికీ పెళ్లయింది కాబట్టే నరేష్ అలా అన్నారు.
నరేష్‌నుంచి నేను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. చట్టప్రకారం నేను ముందుకు వెళతాను’’ అని అన్నారు. తమ పెళ్లి గురించి చెబుతూ.. నరేష్ ప్రేమిస్తున్నానంటూ తన వెంట ఓ సంవత్సరం పాటు తిరిగాడని, అలా తమ పెళ్లి జరిగిందని రమ్య చెప్పారు. మరి, ప్రశాంత్ నీల్, రమ్యల బంధుత్వంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Ramya Raghupathi: నరేష్, పవిత్రా లోకేష్‌లకు పెళ్లయిందంటున్న మూడో భార్య రమ్య