ప్రశాంత్ నీల్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ పుట్టిన రోజు వేడుకల్లో ప్రభాస్ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా ప్రశాంత్ నీల్ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆయన్ని దేశంలోని స్టార్ దర్శకుల్లో ఒకడిగా మార్చివేసింది. ఆ సినిమానే ‘కేజీఎఫ్’.. ఈ సినిమాతో దేశ వ్యాప్తంగా మాస్ సునామీ సృష్టించారు ప్రశాంత్. తర్వాత వచ్చిన కేజీఎఫ్ 2తో భారత సినీ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశారు. ఏ దర్శకుడికీ సాధ్య పడని కొత్త చరిత్రను లిఖించారు. ఆయన తీసిన మూడు సినిమాలు సూపర్ హిట్లు కావటమే కాదు.. సినిమాలను ఈ కోణంలో కూడా తీయోచ్చా అన్న ఆలోచనల్ని రేకెత్తించాయి. ప్రశాంత్ ప్రస్తుతం ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ‘సలార్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
ఇక, శనివారం రాత్రి ప్రశాంత్ నీల్ బర్త్‌డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ప్రభాస్ పాల్గొని సందడి చేశారు. దగ్గరుండి ప్రశాంత్‌తో కేకు కట్ చేయించారు. ఈ వేడుకల సందర్భంగా ఇద్దరూ బ్లాక్ డ్రెస్‌లో కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్‌గా మారాయి. కాగా, ప్రశాంత్ నీల్ 2014లో వచ్చిన ‘ఉగ్రం’ సినిమాతో డైరెక్టర్‌గా మారారు. ఈ సినిమాకు రచన, దర్శకత్వంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరించారు.
ఈ సినిమాలో ప్రశాంత్ బావమరిది అయిన ప్రముఖ కన్నడ హీరో శ్రీమురళి హీరోగా చేశారు. అయితే, విడుదల విషయంలో సినిమా చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది. ఈ నేపథ్యంలో శ్రీమురళి ఫ్రెండ్ అయిన కన్నడ స్టార్ హీరో దర్శన్ ముందుకు వచ్చారు. ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్‌ను ఆయనే చూసుకున్నారు. ఉగ్రం సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాతే కేజీఎఫ్ తెరపైకి వచ్చింది. మరి, ప్రశాంత్ నీల్ బర్త్‌డే వేడుకలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.