కేజీఎఫ్ ఛాప్టర్ 2 సినిమాతో కన్నడ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ప్రశాంత్ నీల్. ప్రస్తుతం ఎక్కడ చూసినా, ఏ ఇద్దరు సినిమా ప్రియులు మాట్లాడుకున్నా అది కేజీఎఫ్ సినిమా గురించే. ఈ సినిమా ఇంతటి సక్సెస్ సాధించి.. అన్ని ఇండస్ట్రీల్లో రికార్డులు బద్దులు కొట్టడం చూసి ప్రతి ఒక్క అభిమాని హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేజీఎఫ్ 2 సక్సెస్ ను డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా ఎంతగానో ఆశ్వాదిస్తున్నాడు. అయితే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ తెలుగు ఇండస్ట్రీకి ఎందుకు వస్తోంది? తెలుగు హీరోలతో సినిమా చేసేందుకు ఓకే చెప్పడం వెనుకున్న అసలు విషయాన్ని తెలిజేశాడు.
ఇదీ చదవండి: పునీత్ రాజ్ కుమార్ సర్ ను బాగా ద్వేషించే వాడిని: ప్రశాంత్ నీల్!
‘కేజీఎఫ్ ఇంత సక్సెస్ సాధించిన విషయం మీరంతా చెబుతుంటేనే నేనూ విని తెలుసుకుంటున్నాను. ఇంతటి రెస్పాన్స్ వస్తుందని నేను ఊహించలేదు. అయితే నేను యశ్, విజయ్ లకు మాత్రమే రెస్పాన్సిబిల్ అనుకున్నాను. నేను వచ్చిన పర్పస్ బిజినెస్. నేను కన్నడ ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లాలి, కన్నడ ఇండస్ట్రీని వృద్ధిలోకి తీసుకురావాలి అనే ఆశయాలతో రాలేదు. నేను వచ్చిన పర్పస్ వేరు- నా లక్ష్యం వేరు. అదేం తెలియకుండా నేను తెలుగు హీరోలతో సినిమా చేయడాన్ని చాలా మంది తప్పుబడుతున్నారు. నా గురిచి తెలియక అలా మాట్లాడుతున్నారు. టాలీవుడ్ లో ఎక్కువ రెమ్యూనరేషన్ వస్తుందని నేను అక్కడికి వెళ్లట్లేదు. వాళ్ల అప్రోచ్ నాకు నచ్చింది. వాళ్లు నాతో మాట్లాడే తీరు నాకు నచ్చింది.’
‘ఉగ్రం సినిమా సమయంలో గానీ, ఆ సినిమాకి ముందు గానీ కన్నడ ఇండస్ట్రీ నుంచి నన్ను పట్టించుకున్న నాథుడు లేడు. నేను ఇంతటి సక్సెస్ సాధించిన తర్వాత ప్రశాంత్ నీల్ అని మాట్లాడుకుంటున్నారు. మహేశ్ బాబు- తారక్ నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడిన తీరు, నన్ను విష్ చేసిన విధానం నచ్చాయి. రెండేళ్ల క్రితం నేను జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు విష్ చేశాను. అప్పుడు మొత్తం నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి. ఒక నాలుగు గంటలపాటు నేను చాలా డిస్టర్బ్ అయ్యాను. అయితే నేను వాళ్ల మాటలను తప్పుగా తీసుకోలేదు. నేను అర్థం చేసుకున్నాను. వాళ్ల స్థానంలో నేనున్నా అలాగే మాట్లాడేవాడిని. అయితే నా గురించి తెలియక వీళ్లంతా ఇలా అనుకుంటున్నారు’ అంటూ ప్రశాంత్ నీల్ టాలీవుడ్ రావడాన్ని వ్యతిరేకిస్తున్న కన్నడ అభిమానులకు క్లారిటీ ఇచ్చాడు. ప్రశాంత్ నీల్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.