డార్లింగ్ ప్రభాస్ సోదరి, కృష్ణంరాజు కుమార్తె, రాధే శ్యామ్ నిర్మాత అయిన ప్రసీద ఉప్పలపాటి గురించి పరిచయం అక్కర్లేదు. అన్న ప్రభాస్ గురించి ఎంతో ప్రేమగా చెప్పాలన్నా, కృష్ణం రాజు అప్డేట్లు కావాలన్నా కూడా ప్రసీదను సోషల్ మీడియాలో ఫాలో అవ్వాల్సిందే. ఇక ఆమె కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. రాధే శ్యామ్ మూవీ ప్రమోషన్స్ సందర్భంలో ఆమె గురించి చాలా మందికి తెలిసింది. పలు ఇంటర్వ్యూల్లో ఆమె పాల్గొంది. అన్న ప్రభాస్ గురించి ఆసక్తికర అంశాలు వెల్లడించింది. సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉండే ప్రసీద.. తాజాగా తనకు ఎదురైన ఓ చేదు అనుభవం గురించి ట్విట్టర్లో చెప్పుకొచ్చారు. స్విగ్గీ సంస్థ సేవలపై ఆమె చిరాకు పడ్డారు. ఈ విషయం మీద ప్రసీద కాస్త ఘాటుగా స్పందించింది.
దేశంలో గత కొంత కాలంగా ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసేవారి సంఖ్య బాగా పెరిగిపోతుంది. ఈ క్రమంలో జొమాటో, స్విగ్గీ వంటి సంస్థలు.. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ బిజినేస్‌లో ప్రథమ స్థానంలో నిలుస్తున్నాయి. ప్రారంభంలో బాగానే ఉన్నప్పటికి.. ప్రస్తుతం వాటి సేవల విషయంలో కస్టమర్లు అనేక ఫిర్యాదులు చేస్తున్నారు. వీరిలో సెలబ్రిటీలు కూడా ఉండటం గమనార్హం. తాజాగా ప్రసీద కూడా స్విగ్గీ వల్ల తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకుంది. ప్రస్తుతం అది వైరలవుతోంది. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: Shubman Gill: ఎలన్ మస్క్ గారు.. ఈ స్విగ్గీని కూడా కొనేయండి! శుభ్‌మన్ గిల్ రిక్వెస్ట్
‘స్విగ్గీ వాళ్లతో నాకు వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఎదురైంది.. వారు నాణ్యత లేని ఆహారాన్ని అందించారని నేను కంప్లైంట్ ఇస్తే.. ఏం చేయలేమని చేతులెత్తేశారు.. బ్యాడ్ స్ట్రీక్స్ ఆర్డర్స్ ఉన్నాయని ఏం చేయలేమన్నారు. వారు వారి పనిని సక్రమంగా చేసి ఉంటే.. మంచి ఆహారాన్ని పంపి ఉంటే.. అలా బ్యాడ్ స్ట్రీక్స్లో ఫస్ట్ ప్లేస్‌లో ఉండేవాళ్లు కాదు. మంచి ఫుడ్ పంపించకుండా.. లేటుగా డెలివరీ చేస్తూ.. రాంగ్ ఆర్డర్లు పంపిస్తూ ఆ తప్పులన్నీ కస్టమర్ మీద బ్యాడ్ స్ట్రీక్ పేరిట సాకులు చెబుతున్నారు’’ అంటూ ప్రసీద మండపడ్డారు.
ఇది కూడా చదవండి: ‘ఫ్రైడ్ రైస్’ ఆర్డర్ చూసి ‘ఫైర్’ అయిన హీరోయిన్!!.
అంతేకాక ‘‘ఇది అత్యంత చెత్త సర్వీస్. దేశంలో అతి పెద్ద ఫుడ్ డెలివరీ యాప్ అయిన స్విగ్గీకి.. తన కస్టమర్లకు సరైన ఫుడ్ అందుతుందా? లేదా? అని తెలసుకోవాల్సిన కనీస బాధ్యత ఉంది. కానీ స్విగ్గీ ఆ బాధ్యత నిర్వర్తించడం లేదు. తన పని తాను సరిగా చేయకుండా.. పైగా కస్టమర్ల మీద నిందలు వేస్తోంది. మామూలుగా అయితే ఇలాంటివి నేను చెప్పను. కానీ ఇలా రోజూ అవుతుండటం, వారు చేసిన తప్పులకు మనల్ని నిందించడంతో నా ఫ్రస్ట్రేషన్ పెరిగింది. స్విగ్గీ కంటే మంచి సేవలు అందించే యాప్స్ ఉండటం సంతోషం.. ఇకపై నేను ఎప్పుడూ స్విగ్గీని వాడను’ అంటూ ప్రసీద వరుస ట్వీట్స్ చేసింది.
Worst experience with @swiggy_in @SwiggyCares !!!!! Taking customers for granted. pic.twitter.com/zZRgXUyeJE
— Praseedha Uppalapati (@PraseedhaU) June 3, 2022
ఇక ప్రసీద ట్వీట్‌కు స్విగ్గీ రిప్లై ఇచ్చింది. మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం.. క్షమించండి.. వెంటనే దాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాం.. మీ ఆర్డర్ ఐడీని పంపించండి అని కోరింది. ప్రసీద ట్వీట్ చూసిన నెటిజనులు.. తమకు గతంలో ఎదురైన అనుభవాలను, స్విగ్గీ వల్ల కలిగిన అసౌకర్యాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Worst experience with @swiggy_in @SwiggyCares !!!!! Taking customers for granted. pic.twitter.com/zZRgXUyeJE
— Praseedha Uppalapati (@PraseedhaU) June 3, 2022
ఇది కూడా చదవండి: స్విగ్గీ సంస్థ మరో కీలక నిర్ణయం.. డెలివరీ బాయ్స్ కు అదిరిపోయే ఆఫర్!