యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి రాజమౌళి డైరెక్షన్ లో మరోసారి మూవీ చేయనున్నాడా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. రాజమౌళి డైరెక్షన్ లో ప్రభాస్ గతంలో ఛత్రపతి, బాహుబలి వంటి సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాలతో ప్రభాస్ మానియా ఒక్కసారిగా మారిపోయిందనే చెప్పాలి. ప్రధానంగా బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ అమాంతంగా పెరిగి ప్రపంచ వ్యాప్తంగా పెరు మంచి నటుడిగా తెచ్చుకున్నాడు.
ఇక ఇదే కాంబినేషన్ మరోసారి రానుందని ఫిల్మ్ నగర్ లో వార్తలు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రభాస్ హీరోగా రాజమౌళి డైరెక్షన్ లో ఓ సినిమాకు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనికి ప్రభాస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇక ప్రస్తుతం ప్రభాస్ సలార్, ఆధిపరుష్, రాధేశ్యామ్ వంటి పాన్ ఇండియా సినిమాలతో జోరు మీదున్నాడు. మరి నిజంగానే రాజమౌళి డైరెక్షన్ లో ప్రభాస్ మరోసారి సినిమాలో నటించబోతున్నాడా అన్నది తెలియాల్సి ఉంది. ఇక దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.