ఈ సంక్రాంతికి చిరు, బాలయ్య బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టేశారు. ఈ ఇద్దరు హీరోలే కాదు డైరెక్టర్స్ బాబీ, గోపీచంద్ మలినేని కూడా తమ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రాలు చేశారు. ఇక ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’.. రెండు కూడా ప్రేక్షకుల్ని ఫుల్ గా ఎంటర్ టైన్ చేస్తున్నాయి. హీరోల నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటనేది ఆల్రెడీ ఫ్యాన్స్ క్లారిటీ వచ్చేసింది. ఇక డైరెక్టర్స్ తర్వాత సినిమాలు ఏంటనేది మెల్లమెల్లగా స్పష్టత వచ్చేసింది. ఈ క్రమంలోనే బయటకొచ్చిన ఓ విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ఇక విషయానికొస్తే.. ‘వీరసింహారెడ్డి’తో బాలయ్యని మాస్ యాంగిల్ లో ప్రెజెంట్ చేసిన గోపీచంద్, ప్రస్తుతం చాలా సంతోషంతో ఉన్నాడు. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ లో పాల్గొంటూ బిజీ అయిపోయాడు. అలా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇతడికి నెక్స్ట్ ప్రాజెక్టు ఏంటనే క్వశ్చన్ ఎదురైంది. దీనికి సమాధానం చెబుతూ.. డార్లింగ్ ప్రభాస్ తో స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయని ఈ డైరెక్టర్ చెప్పుకొచ్చాడు. అది ఫైనల్ స్టేజీలో ఉందని అన్నాడు.
‘ప్రభాస్ తో పాటు పలువురు హీరోలతో నా తర్వాతి సినిమాకు సంబంధించిన డిస్కషన్స్ జరుగుతున్నాయి. కానీ ఇంకా ఏది ఫైనల్ కాలేదు. ‘వీరసింహారెడ్డి’ ప్రమోషన్స్ పూర్తయితే.. కొన్నిరోజులు నేను రెస్ట్ తీసుకుంటాను. ఆ తర్వాత కొత్త మూవీ గురించి వర్క్ స్టార్ట్ చేస్తాను’ అని డైరెక్టర్ గోపీచంద్ మలినేని చెప్పుకొచ్చాడు. మరోవైపు ప్రభాస్ ప్రస్తుతం సలార్, ప్రాజెక్టు K,ఆదిపురుష్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత మారుతితో మూవీ, స్పిరిట్, సిద్ధార్థ్ ఆనంద్ మూవీస్ లైన్ లో ఉన్నాయి. ఒకవేళ దర్శకుడు గోపీచంద్ కు ఓకే చెప్పినాసరే ఇవన్నీ పూర్తయ్యేసరికి ఇంకో నాలుదేళ్లు ఈజీగా పడుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?
Actually 2011 2012 time lo director Gopichand Malineni Planned a Multistarrer with #Prabhas & #GopiChand… Line up busy valla track lo ki raledhu, Parledhu ippudu set chesina kuda… 😎 Kani mass undali oora mass Like Veera Mass… pic.twitter.com/fQLwwwcXON
— Prabhas ❤ (@ivdsai) January 20, 2023