Radhakrishna: మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ హీరోగా, హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సీతారామం’. ఆగష్టు 5న విడుదలైన ఈ సినిమా మంచి టాక్ తో దూసుకెళ్తోంది. భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రతీ క్యారెక్టర్ సినిమాకు హైలెట్ గా నిలించింది. అద్భుత ప్రేమ కథను అంతే డైరెక్టర్ తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఫిదా చేసింది. ముఖ్యంగా హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ సినిమాను మరో లెవల్‌కు తీసుకుపోయింది. ఈ సినిమా సంచలన విజయం సాధించిన నేపథ్యంలో రాథేశ్యామ్ దర్శకుడు రాధాకృష్ణపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.
ప్రభాస్, పూజా హెగ్డే హీరో, హీరోయిన్లుగా దాదాపు 300కు పైగా కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం కాలేదు. కానీ, చిన్న సినిమాగా వచ్చిన ‘సీతా రామం’ పెద్ద హిట్ అయింది. ఇండియన్ టైటానిక్ తీస్తానంటూ.. మునిగిపోయే సినిమా చేశారంటూ ప్రభాస్ ఫ్యాన్స్ రాధాకృష్ణపై మండిపడుతున్నారు. హను రాఘవపూడిని చూపిస్తూ రాధాకృష్ణను తిట్టిపోస్తున్నారు. బడ్జెట్ మీద పెట్టిన ఇంట్రస్ట్ కథ మీద పెట్టి ఉంటే సినిమా హిట్టు అయ్యేదని వాపోతున్నారు.
ప్రభాస్, పూజా హెగ్డే లాంటి వాళ్లతో చిల్లర లవ్ స్టోరీ తీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హను రాఘవపూడి తన గురువు విలక్షణ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి పేరును నిలబెడితే.. అదే గురువు దగ్గర విద్య నేర్చుకున్న రాధాకృష్ణ గురువు పేరును చెడగొడుతున్నారని అంటున్నారు. 30 కోట్లలో ఒక మ్యాజికల్ లవ్ స్టొరీ ఎలా తీయాలో రాఘవ దగ్గర నేర్చుకోవాలని సలహా ఇస్తున్నారు. మరి, రాథేశ్యామ్ డైరెక్టర్‌పై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్ అవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Jr NTR కు ఆరోగ్య సమస్య.. 4 వారాలు రెస్ట్ తీసుకోమన్న వైద్యులు!