ప్రభాస్ చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటి వరకూ ఏ తెలుగు హీరో.. కాదు కాదు ఏ భారతీయ నటుడు సాధించనటువంటి రికార్డును ప్రభాస్ క్రియేట్ చేయనున్నాడు. అది కూడా తెలుగులోనో, బాలీవుడ్ లోనో కాదు.. హాలీవుడ్ లో. అట్లుంటది ప్రభాస్ తోని.
ప్రభాస్.. ఇది పేరు కాదు బ్రాండ్.. పాన్ ఇండియా అనే పదానికి సరైన కటౌట్. తను చేసే సినిమాలు చూస్తే నిజమే అని అనిపిస్తుంది. బాహుబలి సిరీస్‌తో ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ పాన్ ఇండియా స్టార్ ఇప్పుడు చేయబోయే మోస్ట్ అవైటెడ్ మూవీ ‘సలార్’ రిలీజ్‌కు ముందే రికార్డుల మోత మోగిస్తుంది. అది కూడా మన తెలుగు గడ్డ మీదనో లేక మన దేశ గడ్డ మీదనో కాదండోయ్. ఏకంగా హాలీవుడ్ గడ్డ మీదనే. అవును ఇది నిజమే. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా యాక్షన్ మూవీ ‘సలార్’ నార్త్ అమెరికాలో చరిత్ర సృష్టించనుంది. సలార్ మూవీ రెండు పార్ట్‌లుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మొదటి భాగమైన ‘సలార్ సీజ్ ఫైర్’ సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ బద్దలు కొట్టడానికి రెడీ అవుతుంది.
ఈ క్రమంలో అమెరికాలో రికార్డ్ లొకేషన్స్‌లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ప్రభాస్ పుట్టిన సంవత్సరం అయిన 1979ను గుర్తు చేసేలా.. 1979 ప్రదేశాల్లో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇదే విషయం ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. ఒక ఇండియన్ సినిమా అమెరికాలోని ఇన్ని లొకేషన్స్‌లో రిలీజ్ అవ్వడం ఇదే మొదటి సారి. ఇది ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పవచ్చు. ఈ సినిమాతో ప్రభాస్ ఒక సరికొత్త చరిత్రకు నాంది పలకనున్నాడు. అదే జరిగితే కనుక వరల్డ్ బాక్సాఫీస్ బుల్డోజర్ గా ప్రభాస్ సరికొత్త రికార్డులను సృష్టిస్తాడు. తెలుగు సినిమా రేంజ్ ని ఎప్పటికప్పుడు తన సినిమాలతో పెంచుకుంటూ వెళ్తున్నాడు ప్రభాస్.
ఇది నిజంగా తెలుగు సినీ పరిశ్రమ గర్వించదగ్గ విషయం. డార్లింగ్‌కి దేశమంతటా అభిమానులు ఉన్నారు. ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు థియేటర్లు హౌస్ ఫుల్ బోర్డు పెట్టాల్సిందే. ఇదిలా ఉంటే సలార్ సినిమా హిట్ అయితే ప్రభాస్‌కు హాలీవుడ్ నుంచి పిలుపు అందడం గ్యారంటీ అంటున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. సలార్ తర్వాత లైన్ లో ప్రాజెక్ట్ కే, సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో స్పిరిట్, మారుతి దర్శకత్వంలో ఒక సినిమా.. ఇలా వరుసగా మూడు సినిమాలు ఉన్నాయి. మొత్తానికి ప్రభాస్ వరుస సినిమాలతో ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇవ్వనున్నారన్నమాట. ఇది సరిపోదన్నట్టు హాలీవుడ్ లో ఇప్పటి వరకూ ఏ ఇండియన్ సినిమా కూడా రిలీజ్ అవ్వనన్ని లొకేషన్స్ లో సలార్ సినిమా రిలీజ్ చేస్తున్నారు. నిజంగా ఇది ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే మాట. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ రూపంలో తెలపండి.