బుల్లితెర మెగాస్టార్ గా పాపులర్ అయిన నటుడు, దర్శకుడు ప్రభాకర్ గురించి ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. సీరియల్ నటుడిగా ఎంతో క్రేజ్ సంపాదించుకొని.. మరోవైపు సినీ దర్శకుడిగా దూసుకుపోతున్నారు. ప్రభాకర్ అంటే జనాలకు దాదాపు 20 ఏళ్లుగా తెలుసు. కానీ.. ఇప్పుడున్న సోషల్ మీడియా కాలంలో పరిచయాలు కావాలంటే ఏదొక అద్భుతం చేసేయాలి లేదా అందరికంటే తాను డిఫరెంట్ అని ప్రూవ్ చేసుకోవాలి. ఆ విషయంలో ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ తన మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. హీరోగా డెబ్యూ మూవీ కూడా రిలీజ్ కాలేదు.. ఏకంగా మరో రెండు సినిమాలు లైనప్ చేశానని మీడియా ముఖంగా చెప్పాడు.
ఈరోజుల్లో ఇండస్ట్రీలో హీరోగా డెబ్యూ చేయాలన్నా, జనాల్లో పేరు వినిపించాలన్నా సోషల్ మీడియా క్రేజ్ తప్పనిసరి అయిపోయింది. అలాంటి సోషల్ మీడియా క్రేజ్, ఫాలోయింగ్ కోసం చాలాకాలం వీడియోస్ వగైరా చేసుకుంటూ ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ.. మొదటి మీటింగ్ లోనే యాటిట్యూడ్ చూపించి.. ఓవర్ నైట్ లో యాటిట్యూడ్ స్టార్ గా క్రేజ్ సంపాదించుకున్నాడు చంద్రహాస్. అప్పటినుండి ఎక్కడ కనిపించినా ట్రోల్ చేశారు నెటిజన్స్. కానీ.. అదే యాటిట్యూడ్ తో, అవే ట్రోల్స్ తో తనకంటూ హైప్ క్రియేట్ చేసుకున్నాడు. అయితే.. చంద్రహాస్ పై వస్తున్నా ట్రోల్స్ పై ప్రభాకర్ కూడా పాజిటివ్ గానే రియాక్ట్ అయ్యారు.
ఈ క్రమంలో మొన్నటివరకూ అయ్యప్ప స్వామి మాలలో ఉన్న ప్రభాకర్, చంద్రహాస్ సోషల్ మీడియాలో యాక్టీవ్ గానే ఉన్నారు. ఆ తర్వాత అయ్యప్ప దీక్ష పూర్తి కాగానే టీవీ ప్రోగ్రాంలో కూడా పాల్గొంటున్నారు. అయితే.. ఇటీవల సుధీర్ హోస్ట్ గా స్టార్ మా వారు నిర్వహించిన సంక్రాంతి ఈవెంట్ లో.. ప్రభాకర్, చంద్రహాస్ ఇద్దరూ కలిసి స్టేజ్ పై చేసిన ఎనర్జిటిక్ డాన్స్ పెర్ఫార్మన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎప్పటిలాగే యాటిట్యూడ్ స్టార్ గా చంద్రహాస్.. డీసెంట్ గా ప్రభాకర్ ‘పేట’ సాంగ్ కి డాన్స్ చేశారు. మరి ఈ ఈవెంట్ లో కూడా చంద్రహాస్ గురించే తాను టెన్షన్ పడుతున్నానని చెప్పాడు ప్రభాకర్. మరి ప్రెజెంట్ వైరల్ అవుతున్న ప్రభాకర్, చంద్రహాస్ ల డాన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.