సంగీత ప్రపంచాన్ని తన పాటలు, నృత్యాలతో ఉర్రూతలూగించిన మైఖేల్ జాక్సన్ దివికేగి దాదాపుగా 14 ఏళ్లు కావొస్తోంది. పాప్ వరల్డ్‌ను తన మ్యూజిక్ టాలెంట్‌తో కిక్కెంచిన జాక్సన్ మరణం సంగీత అభిమానులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఇప్పుటికీ ఎంతో మంది సింగర్లు, పాప్ స్టార్లు వచ్చినా మైఖేల్ జాక్సన్ లేని లోటును మాత్రం తీర్చలేకపోయారు. గాయకుడిగా, గేయ రచయితగా, డ్యాన్సర్‌గా విభిన్న భూమికలు పోషించి ప్రేక్షకుల హృదయాల్లో జాక్సన్ చెరగని ముద్ర వేశాడు. మూన్ వాక్ లాంటి వైవిధ్యమైన డ్యాన్స్ మూవ్స్‌తో ఓ తరాన్ని ఆయన ఉర్రూతలూగించారు. జాక్సన్ డ్యాన్స్ వీడియోలు ఇప్పటికీ యూట్యూబ్‌లో రికార్డు స్థాయిలో వ్యూస్ సాధిస్తున్నాయి.
మైఖేల్ జాక్సన్ ప్రభావం నేటి తరం మీద కూడా స్పష్టంగా కనిపిస్తోంది. లెబెలె డిస్ప్యూట్, డేంజరస్, బ్యాడ్, థ్రిల్లర్, మోటౌన్ వంటి ఎన్నో ఆల్బమ్స్‌తో ఆడియెన్స్ మనసుల్లో ‘కింగ్ ఆఫ్ పాప్’గా సుస్థిర స్థానం దక్కించుకున్నారు జాక్సన్. ఇంతటి పేరు, డబ్బు, క్రేజ్ తెచ్చుకున్న ఆయన.. 50 ఏళ్ల వయసులో 2009, జూన్ 25వ తేదీన గుండెపోటుతో మరణించారు. మితిమీరిన ట్యాబ్లెట్లు, మెడిసిన్స్ తీసుకోవడం వల్లే ఆయన చనిపోయారని స్పష్టమైంది. ఇకపోతే, జాక్సన్ జీవిత కథ ఆధారంగా ఓ సినిమా తెరకెక్కనుంది. జాక్సన్ బయోపిక్‌ను తీయనున్నట్లు లయన్స్ గేట్ సంస్థ ప్రకటించింది. మైఖేల్ జాక్సన్ బయోపిక్‌ను ఆస్కార్ అవార్డు విన్నింగ్ ప్రొడ్యూసర్ గ్రాహమ్ కింగ్ నిర్మించనున్నారు. ఇందులో జాక్సన్ పాత్రలో జాఫర్ జాక్సన్ నటించనున్నారు.
మైఖేల్ జాక్సన్ సోదరుడు జెర్మైన్ జాక్సన్ కుమారుడే ఈ జాఫర్ జాక్సన్. 26 ఏళ్ల జాఫర్ జాక్సన్ కూడా సింగర్, డ్యాన్సర్ కావడం విశేషం. 12 ఏళ్ల వయసు నుంచే ఆయన పాటలు పాడటం, డ్యాన్సులు చేయడం మొదలుపెట్టారు. ఈ బయోపిక్‌కు ఆంటోని ఫుక్వా దర్శకత్వం వహించనున్నారు. మైఖేల్ జాక్సన్ పాత్రలో నటించే యాక్టర్ కోసం ప్రపంచమంతా వెతికానని.. కానీ చివరికి ఆయన సోదరుడి కొడుకు జాఫర్ జాక్సనే కరెక్ట్ అనిపించిందని డైరెక్టర్ ఆంటోనీ చెప్పారు. మైఖేల్ జాక్సన్ స్టెప్‌ను జాఫర్ వేస్తున్న ఓ ఫొటోను ఆంటోనీ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్టు చేశారు. దీనికి నెటిజన్స్ నుంచి మంచి అప్లాజ్ వస్తోంది. మరి, మైఖేల్ జాక్సన్ బయోపిక్ చూసేందుకు మీరు ఎంత ఉత్సుకతతో ఉన్నారనేది కామెంట్ల రూపంలో తెలియజేయండి.