వైద్య విద్యార్థిని ప్రీతి అంశంపై స్పందించింది ప్రముఖ నటి పూనమ్ కౌర్. కానీ, ఆమె చేసిన ట్వీట్ లో మాత్రం బతికున్న ప్రీతిని చనిపోయినట్టుగా ట్వీట్ చేయడం గమనార్హం.
వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్న ఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమంగా మారుతోంది. ప్రీతి ప్రస్తుతం హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. శనివారం ఉదయం నిమ్స్ వైద్యులు హెల్త్ బులిటెన్ కూడా విడుదల చేశారు. ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని, ఆమెను బతికించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నామని వైద్యులు తెలిపారు. ప్రీతి అంశంపై రాజకీయ, సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే ప్రముఖ నటి పూనమ్ కౌర్ సైతం తాజాగా ట్విట్టర్ వేదికగా స్పందించింది.
తాను చేసిన ట్విట్ లో ఏముందంటే..? మనుగడ , పరువు , న్యాయం మధ్య మరో అమ్మాయి ప్రాణం తీసింది . వైద్య కళాశాలలో ప్రవేశించడానికి చాలా కష్టపడి పనిచేసిన తరువాత, ఆమె తన కలలను వదులుకోవలసి వచ్చింది. మరియు ఆమె తల్లిదండ్రులు దీని నుండి ఎప్పటికీ కోలుకోలేరు. ఏ శిక్ష అయినా నొప్పికి సరిపోదు లేదా న్యాయం పొందదు. అంటూ.. పూనమ్ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ చదవిన చాలా మంది నెటిజన్స్ ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ప్రస్తుతం ప్రీతి క్రిటికల్ కండిషన్ లో ఉన్నది వాస్తవం. కానీ, పూనమ్ మాత్రం.. ప్రీతి చనిపోయినట్లుగా ట్వీట్ చేయడంతో నెటిజన్స్ ఆమె తీరుపై ఫైర్ అవుతున్నారు. ప్రీతి చనిపోయినట్లుగా ట్వీట్ చేసిన పూనమ్ తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మనుగడ , పరువు , న్యాయం మధ్య మరో అమ్మాయి ప్రాణం తీసింది . వైద్య కళాశాలలో ప్రవేశించడానికి చాలా కష్టపడి పనిచేసిన తరువాత, ఆమె తన కలలను వదులుకోవలసి వచ్చింది మరియు ఆమె తల్లిదండ్రులు దీని నుండి ఎప్పటికీ కోలుకోలేరు. ఏ శిక్ష అయినా నొప్పికి సరిపోదు లేదా న్యాయం పొందదు.#warangal #docsaif
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) February 24, 2023