డాక్టర్ ప్రీతి ఆత్మహత్య ఘటన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అలానే ఈకేసులు విషయంలో అనేక కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరో మెడికల్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.
డాక్టర్ ప్రీతి ఆత్మహత్య ఘటన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అలానే ఈకేసులో అనేక కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫిబ్రవరి 22న ప్రీతి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో అపస్మారక స్థితిలోకి వెళ్లడం, తర్వాత నిమ్స్‌కు తరలించగా.. ఫిబ్రవరి 26న తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే తాజాగా మరో వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.
తెలంగాణ రాష్ట్ర నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కాలేజీలో సనత్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. 2020 బ్యాచ్ కు చెందిన సనత్ వసతి గృహంలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడు కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. నిజామాబాద్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సనత్ ఎంబీబీఎస్ మూడో ఏడాది చదువుతున్నాడు. అయితే సనత్ ఆత్మహత్మ చేసుకోవడానికి గల కారణాలు ఏమిటనేది ఇంకా తెలియరాలేదు. శనివారం నుంచి ప్రాక్టికల్స్ జరగనున్నాయి. వీటికి సనత్ హాజరకావల్సి ఉండగా.. ఇలా సూసైడ్ చేసుకుని విగత జీవిగా మారాడు.
సనత్ ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధకరమని ప్రిన్సిపాల్ ఇందిరా అన్నారు. సనత్ అందరితో ఎంతో స్నేహంగా ఉండేవాడని తోటి స్నేహితులు అన్నారు. ఆత్మహత్య చేసుకుని ముందు రోజు రాత్రి కూడా సనత్ చదువుకున్నాడని తోటి విద్యార్థులు తెలిపారు. అయితే అకస్మాత్తుగా ఇలాంటి పని ఎందుకు చేశాడో ఎవరి అర్థంకావడం లేదని అంటున్నారు. సనత్ తల్లిదండ్రులు రమేశ్, సుజాతలు కుమారుడి మృతితో కన్నీరుమున్నీరు అవుతున్నారు. గతనెల 25న ఇదే హాస్టల్ లో హర్ష అనే వైద్య విద్యార్థి కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
హర్ష మంచిర్యాల జిల్లాకు చెందిన వ్యక్తి కాగా, సనత్ కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తి. నెల వ్యవధిలో ఇద్దరు వైద్య విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందనేది అందరిలో వస్తున్న సందేహం. వరంగల్ జిల్లాలో ప్రీతి ఆత్మహత్య రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సీనియర్ వేధింపుల కారణంగా ప్రీతి ఆత్మహత్య చేసుకున్నారు. మరి.. వరుస వైద్య విద్యార్థుల ఆత్మహత్య ఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.