ముంబై బ్యూటీ పూనమ్ బజ్వా.. గ్లామర్ పరంగా రోజురోజుకూ హద్దులు చెరిపేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇండస్ట్రీలో హీరోయిన్ గా వెనకబడిన పూనమ్.. మోడలింగ్ లో మాత్రం ఇంకా సెగలు రేపుతూనే ఉంది. సౌత్ భాషల్లో చాలా సినిమాలు చేసింది కానీ ఎక్కడ కూడా స్టార్ హీరోయిన్స్ లిస్టులో చేరలేకపోయింది. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పదేళ్ల ముందే గుడ్ బై చెప్పేసింది అమ్మడు. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పరుగు మూవీ పూనమ్ కి తెలుగులో చివరిది.
‘మొదటి సినిమా’ అనే మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది పూనమ్. డెబ్యూ మూవీలో పక్కింటి అమ్మాయిలా కనిపించినా.. కింగ్ నాగార్జున సరసన బాస్ సినిమాతో గ్లామర్ తలుపులు తెరిచేసింది. అందం ఉన్నప్పటికీ అభినయంతో ఆకట్టుకునే టైం.. ఈ భామకు సరిగ్గా దొరకలేదట. తెలుగులో ఆపేశాక తమిళ, కన్నడ ఇండస్ట్రీలలో అడపాదడపా సినిమాలు చేసింది.
ఇక పూనమ్ బజ్వా పేరు వింటే తెలుగువాళ్ళకు పరుగు సినిమాలో లేచిపోయిన సుబ్బలక్ష్మి పాత్రే గుర్తొస్తుంది. ఆ పాత్రలో అంతలా గుర్తుండిపోయింది పూనమ్. అయితే.. సినిమాలు కరువైనా సోషల్ మీడియాలో రెచ్చిపోతుంది. నెట్టింట సందేశాలకంటే అందాల ఆరబోతనే ఎక్కువగా ఫాలో అవుతోంది. చీరకట్టు నుండి బికినీ వరకు అన్నివిధాలా ఫ్యాన్స్ ని సంతృప్తి పరుస్తోంది.
ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు అందుబాటులో ఉంటూ.. కొత్త కొత్త ఫోటోషూట్లతో మేని అందాలను ఎరగా వేస్తూ కుర్రకారును ఊరిస్తోంది. తాజాగా పూనమ్ ఇన్ స్టాగ్రామ్ లో పిక్స్ షేర్ చేసింది. కేవలం లాంగ్ టి-షర్ట్ ధరించి థైస్ షో అదరగొడుతుంది. అలా నిలబడి ప్యాంటు లేకుండా నమస్తే పెడుతున్న పోజులో పూనమ్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి పూనమ్ లేటెస్ట్ ఫోటోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.