సినిమాలలో హీరోయిన్స్ పెర్ఫార్మన్స్ చూసి ఆనందించడం వేరు. కానీ.. అదే హీరోయిన్స్ ఏవైనా అవార్డు ఫంక్షన్స్ లో.. లేదా స్పెషల్ ఈవెంట్స్ లో చేసే స్టేజ్ పెర్ఫార్మన్స్ చూడటం వేరు. ఏదొక టైంలో హీరోయిన్స్ స్టేజ్ పై అదిరిపోయే డాన్స్ పెర్ఫార్మన్స్ లతో ఫ్యాన్స్ ని, ఆడియెన్స్ ని ఎంటర్టైన్ చేస్తుంటారు. అలా సూపర్ క్రేజ్ సంపాదించుకొని.. ఓ పాపులర్ అవార్డు ఫంక్షన్ లో స్టేజ్ పై డ్యాన్స్ అదరగొట్టింది పూజా హెగ్డే..
సాధారణంగా సినిమాలలో హీరోయిన్స్ పెర్ఫార్మన్స్ చూసి ఆనందించడం వేరు. కానీ.. అదే హీరోయిన్స్ ఏవైనా అవార్డు ఫంక్షన్స్ లో.. లేదా స్పెషల్ ఈవెంట్స్ లో చేసే స్టేజ్ పెర్ఫార్మన్స్ చూడటం వేరు. ఎంతటి స్టార్డమ్ వచ్చినా.. ఏదొక టైంలో హీరోయిన్స్ స్టేజ్ పై అదిరిపోయే డాన్స్ పెర్ఫార్మన్స్ లతో ఫ్యాన్స్ ని, ఆడియెన్స్ ని ఎంటర్టైన్ చేస్తుంటారు. అలా ఈ మధ్యకాలంలో సూపర్ క్రేజ్ సంపాదించుకొని.. ఓ పాపులర్ అవార్డు ఫంక్షన్ లో స్టేజ్ పై డ్యాన్స్ అదరగొట్టింది పూజా హెగ్డే. కోలీవుడ్ లో గతేడాది బిహైండ్ వుడ్స్ అవార్డుల వేడుక జరిగింది. ఈ వేడుకలో ఎంతోమంది స్టార్స్ అవార్డులు అందుకొని.. పెర్ఫార్మన్స్ లతో ఆకట్టుకున్నప్పటికీ.. పూజా హెగ్డే చేసిన స్టేజ్ పెర్ఫార్మన్స్ ఎక్కువ హైలైట్ అయ్యింది.
ఈ వేడుకలో మెరుస్తున్న రెడ్ డ్రెస్ ధరించి స్టేజ్ ని షేక్ చేసేసింది పూజ. అల వైకుంఠపురంలో, బీస్ట్ సినిమాల మిక్సెడ్ మాషప్ సాంగ్స్ తో పూజా.. తన హాట్ హాట్ బాడీ మూమెంట్స్ తో పెర్ఫార్మన్స్ చేసింది. దీంతో అటు ఫ్యాన్స్ తో పాటు ఆడియెన్స్ కి పూజా డ్యాన్స్ ఫుల్ మీల్స్ లా ఎక్కేసింది. అయితే.. పూజా పెర్ఫార్మన్స్ చేసిన వీడియో.. యూట్యూబ్ లో ట్రెండ్ సృష్టించింది. కోటికి పైగా వ్యూయర్ షిప్ తో పూజా డ్యాన్స్ వీడియో.. ఇప్పటికీ ఆకట్టుకుంటూనే ఉంది. హీరోయిన్స్ స్టేజ్ పై ఆ స్థాయిలో పెర్ఫార్మన్స్ తో అలరించారంటే.. దాని కోసం వారు ఏ స్థాయిలో ప్రాక్టీస్ చేసి ఉంటారో ఊహించవచ్చు. పది నిమిషాల పెర్ఫార్మన్స్ కోసం కొన్ని రోజులపాటు వారు ప్రాక్టీస్ చేస్తుంటారు.
ఈ క్రమంలో పూజా స్టేజ్ పై చేసిన డ్యాన్స్ పెర్ఫార్మన్స్ కి ముందు.. ఆమె డాన్సర్స్ తో కలిసి ప్రాక్టీస్ ఎలా చేసిందో వీడియో రిలీజ్ అయ్యింది. ఈ రిహార్సల్స్ వీడియోలో చూస్తే.. తోటి డాన్సర్స్ తో కలిసి పూజా ఎంతో కష్టపడింది. ఆమె కష్టాన్ని మనం ప్రాక్టీస్ వీడియోతో పాటు స్టేజ్ పెర్ఫార్మన్స్ లో కూడా చూడవచ్చు. ప్రస్తుతం పూజా స్టేజ్ పెర్ఫార్మన్స్ కి సంబంధించి ప్రాక్టీస్ చేసిన రిహార్సల్స్ వీడియో.. నెట్టింట వైరల్ గా మారింది. డ్యాన్స్ మూమెంట్స్ తో పాటు హిప్ హాప్ మూవ్స్, బాడీ షేక్ ఇలా అన్నివిధాలా పూజా కేర్ తీసుకుంది. ఇదిలా ఉండగా.. ప్రెజెంట్ పూజా మహేష్ బాబు సరసన ‘SSMB28’, సల్మాన్ ఖాన్ తో KBKJ సినిమాలలో నటిస్తోంది. ఇప్పటికైతే అమ్మడి ఆశలన్నీ ఈ రెండు సినిమాలపైనే ఉన్నట్లు సమాచారం. మరి పూజా డ్యాన్స్ పెర్ఫార్మన్స్ కష్టంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.