సినిమాలలో హీరోయిన్స్ పెర్ఫార్మన్స్ చూసి ఆనందించడం వేరు. కానీ.. అదే హీరోయిన్స్ ఏవైనా అవార్డు ఫంక్షన్స్ లో.. లేదా స్పెషల్ ఈవెంట్స్ లో చేసే స్టేజ్ పెర్ఫార్మన్స్ చూడటం వేరు. ఏదొక టైంలో హీరోయిన్స్ స్టేజ్ పై అదిరిపోయే డాన్స్ పెర్ఫార్మన్స్ లతో ఫ్యాన్స్ ని, ఆడియెన్స్ ని ఎంటర్టైన్ చేస్తుంటారు. అలా సూపర్ క్రేజ్ సంపాదించుకొని.. ఓ పాపులర్ అవార్డు ఫంక్షన్ లో స్టేజ్ పై డ్యాన్స్ అదరగొట్టింది పూజా హెగ్డే..
Pooja Hegde: టాలీవుడ్ మోస్ట్ గార్జియస్ బ్యూటీ పూజా హెగ్డేకి సంబంధించిన డ్యాన్స్ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. బిహైండ్ వుడ్స్ గోల్డ్ మెడల్స్ 8వ ఎడిషన్ అవార్డ్ షో మే 21, 22వ తేదీల్లో చెన్నై ఐలాండ్ బీచ్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో మన టాలీవుడ్ బుట్ట బొమ్మ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. దాదాపు 9 నిమిషాల పాటు కంటిన్యూగా తాను నటించిన సినిమా సాంగ్స్ కి స్టెప్పులేసింది. […]