చిత్ర పరిశ్రమలో స్టార్ యాక్టర్స్ మధ్య స్నేహం పైకి కనబడదు. కానీ వారు కూడా ఎప్పటికప్పుడు మంచి చెడులను మాట్లాడుకుంటూ ఉంటారు. సినిమాల పరంగానే కాకుండా బయట కూడా ఎంతో స్నేహంగా, సన్నిహితంగా ఉండేవారున్నారు. అలాంటి హీరోలలో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ముందే ఉంటారు. వీరిద్దరూ ఫ్యాన్స్ కంటపడరు. కానీ ఫెస్టివల్స్ టైంలో విష్ చేసుకుంటారు. తాజాగా క్రిస్మస్ ఫెస్టివల్ దగ్గర పడటంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటి నుండి సూపర్ స్టార్ మహేష్ ఫ్యామిలీకి క్రిస్మస్ స్పెషల్ గిఫ్ట్ చేరిందట. ఈ విషయాన్నీ స్వయంగా మహేష్ సతీమణి నమ్రత ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా వెల్లడించింది.
తాజాగా పవన్ ఫ్యామిలీ నుండి మహేష్ ఫ్యామిలీకి గిఫ్ట్ చేరడంతో మహేష్ అభిమానులు సోషల్ మీడియాలో సంతోషం వ్యక్తం చేస్తున్నారు మరి ఆ గిఫ్ట్ ఎవరు పంపారా.. అంటే పవన్ భార్య అన్నా లెజ్‌నేవా పంపినట్లు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో నమ్రత తెలిపింది. క్రిస్మస్ కానుకగా చాక్లెట్లతో కూడిన ఒక స్పెషల్ బాక్స్, అలాగే ప్రత్యేకమైన నోట్ కూడా ఆమె పంపినట్లు తెలుస్తుంది. ఈ స్పెషల్ కానుకకు నమ్రత ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసింది. అయితే.. మహేష్ ఫ్యామిలీకే కాకుండా ఇండస్ట్రీలో చాలామంది సినీ ప్రముఖులకు అన్నా క్రిస్మస్ కానుకలను పంపుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆ గిఫ్ట్ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది.