పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తెలుగునాట ఈ పేరుకి ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మధ్యలో పవన్ పొలిటికల్ గ్యాప్ తీసుకోవడం, ఆ తరువాత కమ్ బ్యాక్ ఇవ్వడం తెలిసిందే.కానీ.., చాలా రోజులుగా అప్కమింగ్ ప్రాజెక్టులపై అప్డేట్స్ లేక టెన్షన్ పడుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు పైనల్లీ గుడ్ న్యూస్ వినిపిస్తోంది. ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హరి హర వీరమల్లు’.. సాగర్ కె.చంద్ర తో చేస్తున్న ‘అయ్యప్పనుమ్ కొశీయుమ్’ రీమేక్లు త్వరలోనే పట్టాలెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. లాక్డౌన్, అలాగే స్వయంగా తానే కరోనా బారినపడటంతో ఈ మూవీలు నిలిచిపోగా… ఇప్పుడన్నీ సెట్ అయ్యేలా ఉన్నాయి. ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న పవన్.. వీలైనంత త్వరగా ఈ చిత్రాలను పూర్తి చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది. ఆగస్ట్ నుంచి తిరిగి సెట్స్ లో అడుగుపెట్టాలని డిసైడైన పవన్.. ‘ఏకే’ రీమేక్ తో పాటు సమాంతరంగా ‘వీరమల్లు’ షూటింగ్ కూడా చేసేలా షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటున్నారట. అయితే ముందుగా ఏకే చిత్రాన్ని కంప్లీట్ చేయాలని పవన్ భావిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే 40 శాతానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రంలో రానా దగ్గుబాటి కూడా నటిస్తున్నాడు.
ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు – స్క్రీన్ ప్లే అందిస్తుండటంతో ఓ రేంజ్లో అంచనాలు ఉన్నాయి. దీంతో పవన్ను ఏమాత్రం డిసప్పాయింట్ చేయకుంగా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారట ఏకే మూవీని. ఇక పవన్ కెరీర్ లో మొదటి పీరియాడికల్ మూవీగా తెరకెక్కుతున్న ‘హరి హర వీరమల్లు’ సినిమా షూటింగ్ కూడా 45 శాతం పూర్తయ్యింది. దీని కోసం ఆల్రెడీ ఉన్న సెట్స్ తో పాటుగా మరికొన్ని భారీ సెట్స్ నిర్మాణం చేయాల్సి ఉందట. అందుకే ముందు ‘ఏకే’ రీమేక్ ని కంప్లీట్ చేసి.. ‘వీరమల్లు’ ని సంక్రాంతి కి రెడీ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకి సంబంధించి హరీష్ శంకర్ పూర్తి స్క్రిప్ట్ ను పూర్తి చేశాడని, షూట్ కి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడని తెలుస్తోంది. హరీష్ మూవీని జులైలో ప్రారంభం కానున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇటు ఏకే, హరిహరవీరమల్లు షూటింగుల గ్యాపుల్లోనే ఈ మూవీని తీయబోతున్నట్టు తెలుస్తోంది. అంటే అన్ని కూడా ఏడాదిలోపే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది. వరుసగా మూడు క్రేజీ ప్రాజెక్టులే కావడంతో… ప్యాన్స్ కళ్లల్లో ఒత్తులు పెట్టుకుని మరీ వీటి అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇకనైనా ఎలాంటి అవాంతరాలు రావొద్దని కోరుకుంటున్నారు. మరి.. పవర్ స్టార్ ఇలా సినిమాల విషయంలో స్పీడ్ పెంచడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.