సెకండ్ ఇన్నింగ్స్ లో వరస సినిమాలతో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్, మరోసారి త్రివిక్రమ్ తో కలిసి పనిచేయనున్నారు. కానీ ఇక్కడే ఓ చిన్న ట్విస్ట్ ఉంది. ఇంతకీ అదెంటో తెలుసా?
టాలీవుడ్ లో హీరోలకు మాత్రమే కాదు డైరెక్టర్స్ కూడా డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. అలాంటి వారిలో రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్ తదితరులు టాప్ లో ఉంటారు. వీళ్ల నుంచి కొత్త సినిమా అంటే చాలు.. ప్రేక్షకులు చాలావరకు కళ్లు మూసుకుని థియేటర్ కి వెళ్లిపోతారు. ఈ దర్శకులపై అంత నమ్మకం మరి. ఇక త్రివిక్రమ్-పవన్ కల్యాణ్ కాంబోలో సినిమా కోసం పవర్ స్టార్ అభిమానులైతే ఎప్పటినుంచో వెయిటింగ్. ‘అజ్ఞాతవాసి’ తర్వాత అది అలా పెండింగ్ లోనే ఉండిపోయింది. ఇప్పుడు ఈ కాంబోలోనే మరో సినిమా ఫిక్సయింది.
ఇక వివరాల్లోకి.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు డైరెక్టర్ త్రివిక్రమ్ ప్రాణ స్నేహితుడు. ‘జల్సా’తో హిట్ కొట్టిన వీరి కాంబో.. ‘అత్తారింటికి దారేది’తో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. కానీ ‘అజ్ఞాతవాసి’ మూవీతో ఫెయిల్యూర్ ని చూశారు. దీని తర్వాత పవన్ తో త్రివిక్రమ్ మూవీస్ చేయనప్పటికీ.. ఆయన సినిమా బాధ్యతల్ని దగ్గరుండి చూసుకుంటున్నారు. పవన్ రీఎంట్రీలో ‘భీమ్లా నాయక్’ కోసం స్క్రీన్ ప్లేతో పాటు ఓ పాట రాసిన త్రివిక్రమ్.. ఇప్పుడు #PKSDT15 కోసం స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు. ఇప్పుడు మరో సినిమా కోసం స్టోరీ రెడీ చేసేసినట్లు తెలుస్తోంది.
రవితేజతో ‘రావణాసుర’ తీసిన డైరెక్టర్ సుధీర్ వర్మ.. తాజాగా రిలీజ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ తో సినిమా బాకీ ఉందని చెప్పాడు. ‘గతంలోనే నేను తీసిన ‘కేశవ’ మూవీ నిర్మాత చినబాబు, దర్శకుడు త్రివిక్రమ్ కు నచ్చింది. ఓ రోజు ఫోన్ చేసి దాని గురించి నాతో మాట్లాడారు. కొన్నాళ్ల తర్వాత తాను ఓ పాయింట్ అనుకున్నానని నాకు చెప్పారు. దానిపై సినిమా చేయాలన్నారు. పవన్ కల్యాణ్ కు ఈ ఐడియా నచ్చిందని అన్నారు. సినిమా ఎప్పుడుంటుంది ఏంటనేది చెప్తానని నాతో అన్నారు’ అని సుధీర్ వర్మ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’, ‘వినోయద సీతం’ రీమేక్ చేస్తున్న పవన్.. దీని తర్వాత సుజీత్ ‘OG’, హరీశ్ శంకర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’లోనూ నటిస్తారు. ఇవి పూర్తయిన తర్వాతే సుధీర్ వర్మ-పవన్ కాంబోలో మూవీ ఉండే ఛాన్సులు కనిపిస్తున్నాయి. మరి త్రివిక్రమ్ స్టోరీతో పవన్ మరో సినిమా చేస్తుండటంపై మీరేం అంటారు. కింద కామెంట్ చేయండి.
Political thriller aithe bagundu.. #PSPK31 pic.twitter.com/0Fmyp1rhPE
— Pawanfied (@Only_PSPK) March 19, 2023