పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆయన రేంజ్, క్రేజ్ వేరు. ఇక ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలో కూడా పవర్ స్టార్ కెపాసిటీని మ్యాచ్ చేయడం అందరివల్ల అయ్యే పని కాదు. ఇందుకే పవన్ తో ఒక్క సినిమా చేసినా చాలని నిర్మాతలు అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు. ఇండస్ట్రీ మొత్తాన్ని శాశించే దిల్ రాజు కూడా వకీల్ సాబ్ వరకు పవన్ నిర్మాత అని అనిపించుకోలేకపోయాడు. ఇది పవన్ కళ్యాణ్ రేంజ్. అయితే.., గత కొన్ని రోజుల నుండి పవన్ కళ్యాణ్ విషయంలో ఒక న్యూస్ వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ ఒక స్టార్ ప్రొడ్యూసర్ కి క్లాస్ పీకాడు అన్నది ఆ వార్త సారాంశం. ఆ వివరాల్లోకి వెళ్తే..
ఏ.ఎం.రత్నం.. పవన్ కళ్యాణ్ కి “ఖుషి” లాంటి సూపర్ హిట్ సినిమాని అందించిన నిర్మాత. ప్రస్తుతం ఈయన పవన్ తో .. “హరి హర వీర మల్లు” అనే పాన్ ఇండియా అనే పాన్ ఇండియా సినిమాని తెరకెక్కిస్తున్నాడు. మొత్తం ఈ మూవీ బడ్జెట్ రూ.150 కోట్ల. అయితే.., ముందుగా అనుకున్నట్టు ఈ మూవీ షూట్ సజావుగా సాగడం లేదు. భారీ సెట్స్, భారీ యూనిట్స్ అవసరం కావడంతో పవన్ ముందుగా మిగతా సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డారు. ఈ కరోనా ప్రభావం కాస్త తగ్గాక “హరి హర వీర మల్లు”కోసం పూర్తి సమయం కేటాయించవచ్చు అన్నది పవన్ ఆలోచన. అయితే.., ఇంతలోనే ఏ.ఎం.రత్నం కాస్త టెన్షన్ కి గురయ్యారట.
“మిమ్మల్ని నమ్మి రూ.150 కోట్లు బడ్జెట్ పెడుతున్నాను. కాస్త కనికరించండి అంటూ పవన్ కి మెసేజ్ పెట్టాడట ఏ.ఎం.రత్నం. దీనికి. పవన్ కూడా అంతే సీరియస్ అయ్యాడట. “మీరు కథని నమ్మి రూ.150 కోట్లు ఖర్చు పెడుతున్నారు. నన్ను నమ్మి కాదు, సినిమాకి ఏమి కాదు, బాగా వస్తుంది”అని నిర్మాతకి దైర్యం చెప్పాడట పవన్. అయితే.., ఇదంతా కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్న ప్రచారమే గాని.., అధికారికంగా ఈ విషయంలో ఎలాంటి వార్త బయటకి రాలేదు.
నిజానికి పవన్ కళ్యాణ్ కి నిర్మాతలు అంటే చాలా గౌరవం. తన సినిమాలకి నష్టం వస్తే.., నిర్మాతలను, డిస్ట్రిబ్యూటర్స్ ని ఆదుకున్న చరిత్ర పవన్ సొంతం. మరి.., అలాంటి పవన్ కళ్యాణ్ పై ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకొచ్చాయో తెలియడం లేదు. మరి.., ఈ విషయం నిజమని మీరు నమ్ముతున్నారా? దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.